OTT: 13 రోజుల్లోనే ఓటీటీలోకి సంచలన చిత్రం.. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకంటే?
ప్రస్తుత కాలంలో సినీ ప్రియులు ఎక్కువగా ఫాలో అవుతుంది ఓటీటీలను. అందులో వచ్చే డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ ద్వారా ఇంట్లో ఉండటంతో ఓటీటీలు చూసి వినోదాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు థియేటరల్లో సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసుల రూపంలో ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. అలాగే థియేటర్లలో విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమాలను సైతం ఓటీటీల్లో అతి తక్కువ సమయంలోనే రిలీజ్ చేస్తున్నారు. అలా తాజాగా డిజిటల్ వేదికపై మరో సెన్సేషన్ మూవీ విడుదల కానుంది.
లోక నాయకుడు కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ టైటిల్ తో విడుదలైన మూవీ 'నాయకుడు'. తమిళంలో మంచి హిట్ సాధించిన 'మామన్నన్' (Maamannan) మూవీని తెలుగులో 'నాయకుడు' (Nayakudu 2023) పేరుతో జూలై 14న విడుదల చేశారు. కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్, కమెడియన్ వడివేలు, మహానటి కీర్తి సురేష్, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. దీన్ని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు తెలుగులో విడుదల చేశాయి.

ఇప్పటివరకు వడివేలు కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో హాస్యాన్ని పండించారు. అయితే ఈ మధ్య హాస్య నటులందరూ సీరియస్ పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మామన్నన్ సినిమాతో వడివేలు కూడా మొదటిసారి సీరియస్ రోల్ చేశారు. తమిళంలో జూన్ 29న విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. అక్కడ సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. రెండు వారాల తర్వాత జూలై 14న నాయకుడు పేరుతో విడుదల చేశారు.
రాజకీయల్లోని అసమానతల కథాంశంగా వచ్చిన నాయకుడు సినిమాకు బేబి ఎఫెక్ట్ తగిలింది. కంటెంట్ పరంగా బాగున్న తెలుగులో పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా జూలై 27 నుంచి నాయకుడు (Nayakudu OTT) సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అంటే తెలుగు వెర్షన్ విడుదలైన 13 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఈ తమిళ సంచలన చిత్రం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సుమారు రూ. 10 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరి థియేటర్లలో మిస్ అయిన వారు మామన్నన్ (Maamannan OTT) సినిమాను ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు.


Click it and Unblock the Notifications











