Marco OTT: ఓటీటీలోకి 100 కోట్ల మార్కో.. మోస్ట్ వయెలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Marco OTT: రోజురోజుకు ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. థియేటర్లలో సినిమాలు చూసే వారికంటే.. ఓటీటీల్లోనే సినిమాలు, వెబ్‌సిరీస్ చూసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఓటీటీ లవర్స్ ఆట్రాక్ట్ చేయడానికి అన్లైన్ ఫ్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను (సినిమాలు, వెబ్ సిరీస్) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లో పలు సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, కామెడీ, అడ్వెంచర్ థ్రిల్లర్ వంటి వివిధ జానర్ల సినిమాలు, వెబ్‌సీరీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా రూ.100 కోట్లకు పై కలెక్ట్ చేసిన మోస్ట్ వయెలెంట్, క్రైమ్‌ మార్కో మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. ఆ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

గతేడాది మలయాళంలో రూపొందిన క్రైమ్, హారర్ థ్రిల్లర్ మార్కో. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. భారీ మొత్తం వసూళ్లను సాధిస్తున్నది. కేరళ, తమిళనాడు, తెలుగులో రికార్డు వసూళ్లు చేసింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఉన్ని ముకుందన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విమర్శలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ మూవీని క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మాణంలో హానీఫ్ అదేనీ దర్శకత్వంలో రూపొందింది.

Unni Mukundan s Malayalam Action Movie Marco streaming from February 14 onwards on Sony LIV Premium

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యువనటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించగా.. సిద్ధిఖ్, జగదీష్, అభిమన్యు తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సోన్ పౌల్‌లు ప్రధాన పాత్రలో నటించారు. ఉన్ని ముకుందన్ గతంలో జనతా గ్యారేజ్, భాగమతి, యశోద, మాలికాపురం వంటి సినిమాలతో ప్రధాన పాత్రలో నటించగా.. మార్కో సినిమాలో ఉన్ని ముకుందన్ మెయిన్ హీరోగా నటించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మార్కో సినిమా కథేంటంటే?.. ఆడెట్టు కుటుంబ దత్తపుత్తుడు మార్కో (ఉన్ని ముకుంద‌న్‌). ఇంటికి పెద్ద కొడుకైన జార్జ్ (సిద్ధిఖ్‌) త‌న సొంత త‌మ్ముడు విక్టర్‌ (ఇషాన్ షౌక‌త్‌)తో స‌మానంగా మార్కోని చూస్తాడు. అంధుడైన విక్టర్‌కి మార్కో అంటే చాలా ఇష్టం.. ఈ విక్టర్‌ను రస్సెల్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేస్తాడు. విక్టర్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకొనేందుకు మార్కో సిద్దమవుతాడు. విక్టర్‌ను రస్సెల్ ఎందుకు చంపాడు? విక్టర్‌ను చంపిన రస్సెల్‌ను మట్టుపెట్టే ఛాన్స్ వచ్చిన మార్కో ఎందుకు వెనుకడుగు వేశాడు? చివరకు విక్టర్ ప్రేయసి కడుపులో పెరుగుతున్న బిడ్డను మార్కో రక్షించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మార్కో సినిమా కథ.

Unni Mukundan s Malayalam Action Movie Marco streaming from February 14 onwards on Sony LIV Premium

పాజిటివ్ రివ్యూలు అందుకున్న మూవీ ఏకంగా రూ.115 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ముకుందన్ కెరీర్ లో హైయ్యేస్ట్ కలెక్షన్స్ వసులు చేసిన మూవీగా నిలిచింది. ఏ సెన్సార్ సర్టిఫికేట్‌తో వంద కోట్ల క్లబ్‌ దాటిన తొలి సినిమాగా మార్కో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇదెలా ఉంటే.. మోస్ట్‌ వయలెంట్‌ చిత్రం మార్కో ఓటీటీలో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రైట్స్ ను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా ఈ మూవీ ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ కానున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియాలో ప్రకటించింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్‌లో అందుబాటులో ఉండనుంది.

More from Filmibeat

Read more about: unni mukundan marco sony liv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X