Marco OTT: ఓటీటీలోకి మార్కో మూవీ.. మోస్ట్ వయెలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Marco OTT Release: గతేడాది మలయాళంలో రూపొందిన క్రైమ్, హారర్ థ్రిల్లర్ మార్కో. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ స్రుష్టించింది. భారీ మొత్తం వసూళ్లను సాధిస్తున్నది. కేరళ, తమిళనాడు, తెలుగులో రికార్డు వసూళ్లు చేసింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఉన్ని ముకుందన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి విమర్శలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మాణంలో హానీఫ్ అదేనీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం ఓటీటీ లవర్స్ తెగ వేచి చూస్తున్నారు. ఇంతకీ మార్కో మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళ చిత్ర పరిశ్రమకు ఊపిరిపోయిన సినిమా మార్కో. హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన మార్కోలోయువనటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించగా.. సిద్ధిఖ్, జగదీష్, అభిమన్యు తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సోన్ పౌల్‌లు కీలక పాత్రలు పోషించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై షరీఫ్ మొహమ్మద్ దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా రవి బస్రూర్ సంగీతం అందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఫుల్ పాజిటీవ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఉన్ని ముకుందన్ గతంలో జనతా గ్యారేజ్, భాగమతి, యశోద, మాలికాపురం వంటి సినిమాలతో ప్రధాన పాత్రలో నటించగా.. మార్కో సినిమాలో ఉన్ని ముకుందన్ మెయిన్ హీరోగా నటించారు. ముకుందన్ కెరీర్ లో హైయ్యేస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది.ఏకంగా రూ.115 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఏ సెన్సార్ సర్టిఫికేట్‌తో వంద కోట్ల క్లబ్ దాటిన తొలి సినిమాగా మార్కో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది.
ఇదెలా ఉంటే.. మోస్ట్ వయలెంట్ చిత్రం మార్కో ఓటీటీలోకి వచ్చేయనుంది. తొలుత మార్కో ఓటీటీ రైట్స్ ను ' నెట్‌ఫ్లిక్స్ ' కొనుగోలు చేసినట్టు టాక్ వచ్చింది. కానీ, ఫైనల్ గా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మార్కో రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నది. తాజాగా ఈ మూవీ ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ కానున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియాలో ప్రకటించింది.

మార్కో మూవీ కథేంటీ ?
ఆడెట్టు ఫ్యామిలీకి, రస్సెల్ కుటుంబానికి వ్యాపార పరంగా వైరం కొనసాగుతుంటుంది. ఆడెట్టు ఫ్యామిలీకి దత్త పుత్తుడు మార్కో. ఫ్యామిలీ మొత్తం అవమానించినా.. తన తండ్రి తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవిస్తాడు జార్జ్ (సిద్దిఖీ). జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఆయనకు వ్యాపారంలో ఎదురెరుండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. సెంట్ తయారీలో నిపుణుడైన మార్కో సొదరుడు విక్టర్ అంధుడు.ఈ విక్టర్‌ను రస్సెల్ వ్యాపార వారసుడు రస్సెల్ ఐజాక్ (అభిమన్యు) దారుణంగా హత్య చేస్తాడు. అయితే విక్టర్ హత్యకు ప్రతీకారం తీర్చుకొనేందుకు మార్కో సిద్దమవుతాడు. విక్టర్‌ను రస్సెల్ ఎందుకు చంపాడు? విక్టర్‌ను చంపిన రస్సెల్‌ను మట్టుపెట్టే ఛాన్స్ వచ్చిన మార్కో ఎందుకు వెనుకడుగు వేశాడు? చివరకు విక్టర్ ప్రేయసి కడుపులో పెరుగుతున్న బిడ్డను మార్కో రక్షించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మార్కో సినిమా కథ.


Click it and Unblock the Notifications











