OTT: కిల్ మూవీని మించిన రక్తపాతం.. మార్కో ఏ ఓటిటిలో తెలుసా? రికార్డు ధరకు రైట్స్!

వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ రంగంలో సినీ రంగం చాలా పెద్దది అని చెప్పవచ్చు. మరి బిగ్ స్క్రీన్స్ పై ఆడియెన్స్ ని అలరించేందుకు చాలా జానర్స్ లో ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. అయితే మంచి వైలెన్స్, యాక్షన్ సినిమాల జానర్లో మాత్రం హాలీవుడ్ సినిమాలు చాలా నాచురల్ గా ఉంటాయని చెప్పడంలో డౌట్ లేదు. ఒక హింసాత్మక రక్తపాతం అంటే హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు కనిపిస్తాయి.

కాగా ఈ తరహా సినిమాలు మన ఇండియన్ సినిమా దగ్గర చాలా తక్కువ మెయిన్ గా హాలీవుడ్ సినిమాల తరహాలో ఒక ఇంటెన్స్ కథ మెయిన్ గా ఆ వైలెన్స్ ని నాచురల్ గా చూపించిన సినిమాలు దాదాపు లేనే లేవు అనే మాటకి సమాధానంగా వచ్చిన సినిమానే "కిల్". బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా దెబ్బకి ఈ సినిమా హక్కులు హాలీవుడ్ సంస్థలే రీమేక్ చేసుకునేందుకు కొనుకోవడం విశేషం.

Unni mukundan s Marco locks ott partner for fancy amount Here is the details

మరి ఇలాంటి సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఇండియా వైడ్ గా వినిపించిన మరో వైలెన్స్ సినిమా పేరే "మార్కో". కంటెంట్ కి కేరాఫ్ అయినటువంటి మళయాళ సినిమా నుంచి వచ్చిన మోస్ట్ వాంటెడ్ వైలెన్స్ సినిమా ఇది కాగా భాగమతి, జనతా గ్యారేజ్ సినిమాల్లో కనిపించిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. మరి ఈ సినిమా చూసిన చాలామంది కిల్ తో పోల్చిన వారు కూడా లేకపోలేరు.

ఇలా ఇండియన్ సినిమా దగ్గర కిల్ తర్వాత ఆ రేంజ్ లో వినిపించిన బ్రూటల్ యాక్షన్ సినిమా అయినప్పటికీ సినిమాకి ఓటిటి ఎవరు సొంతం చేసుకున్నారు అనే డీటెయిల్స్ బయటకి రాలేదు. కాగా ఈ గ్యాప్ లోనే కిల్ సినిమా వరల్డ్ వైడ్ 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టేసింది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి వివరాలు ఇపుడు తెలుస్తున్నాయి.

Unni mukundan s Marco locks ott partner for fancy amount Here is the details

ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ కాదు సోనీ లివ్ వారు భారీ ధరకి సొంతం చేసుకున్నారట. మరో ఓటిటి యాప్ డిస్నీ హాట్ స్టార్ వారు ఎక్కువగా మలయాళ సినిమాలు తీసుకుంటారు కానీ మార్కో మాత్రం నెట్ ఫ్లిక్స్ తీసుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఇంట్రెస్టింగ్ గా సోని లివ్ వారు ఈ సినిమాని మలయాళ ఏ ఇతర సినిమాకి కూడా ఇవ్వని భారీ మొత్తంతో సోని లివ్ వారు కొనుగోలు చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల దాటింది సో ఎనీ టైం సోని లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ డేట్ ఏంటి ఎప్పుడు అనేవి బయటకి రావాల్సి ఉంద. ఈ చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించగా కేజీఎఫ్, సలార్ సినిమాల సంగీత దర్శకుడు రవి బాస్రుర్ సంగీతం అందించారు.

More from Filmibeat

Read more about: marco marco ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X