Unstoppable 2: సీనియర్ మోస్ట్ డైరెక్టర్ కోసం డిజిటల్ ఇంటర్వ్యూ.. ఈసారి షో కోసం టాప్ 4 లెజెండ్స్!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. విభిన్న స్వభావం కలిగిన దర్శకులు నటీనటులు రాజకీయ ప్రముఖులు షోలోకి వస్తున్నారు. బాలకృష్ణ కేవలం నార్మల్ ఇంటర్వ్యూగా కాకుండా విభిన్నమైన కాంట్రవర్సీ ప్రశ్నలను అడుగుతూ షో పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే సీనియర్ హీరోయిన్ రాధిక గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ కూడా బాగానే క్లిక్కయ్యింది.

ఇక రాబోయే రోజుల్లో సీనియర్ మోస్ట్ దర్శకులు నిర్మాతలు కూడా గెస్ట్ లుగా కనిపించబోతున్నారు. తదుపరి ఎపిసోడ్ కోసం ఒక నలుగురిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం మొదటిసారి డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నారు. ఇక షోలోకి అయితే మరోసారి నిర్మాత అల్లు అరవింద్ రాబోతున్నారు. ఆయన ఇదివరకే అల్లు అర్జున్ తో షోలో ఒకసారి గెస్ట్ గా వచ్చారు.

Unstoppable 2 with nbk upcoming episode chief guests details

ఇక ఇప్పుడు ఆయనతో పాటు మరో సినియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కూడా రాబోతున్నారు. అలాగే మరొ ఇద్దరు లెజెండ్ దర్శకులు కూడా షోలో సందడి చేయబోతున్నారు. అల్లు అరవింద్, సురేష్ బాబు ఇద్దరితో కలిసి ముందుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రాబోతున్నారు. ఇక వీరితో డిజిటల్ టెక్నాలజీ ద్వారా మరో సీనియర్ దర్శకుడు కాళతపస్వి కె.విశ్వనాథ్ ను బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నారు.

వీరి నలుగురితో చేయబోయే ఇంటర్వ్యూ చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వివాదాల పై కూడా అల్లు అరవింద్, సురేష్ బాబు లను కూడా బాలయ్య సందేహాలు అడిగే అవకాశం లేకపోలేదు. ఇక కె.విశ్వనాథ్ కూడా చాలా రోజుల తరువాత ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. రాఘవేంద్రరావు కూడా ఇప్పుడు కొనసాగుతున్న సెకండ్ ఇన్నింగ్స్ గురించి తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. మరి ఈ ఎపిసోడ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X