Balakrishna-Chiru-KTR: ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్... ఒకే వేదికపై చిరు, బాలయ్య, కేటీఆర్!
నందమూరి బాలయ్య ఫ్యాన్స్ చొంకాలు చింపుకునే న్యూస్. కేవలం నందమూరి ఫ్యాన్స్ యే కాదు.. చిరంజీవి, కేటీఆర్ లాంటి వారి ఫ్యాన్స్ కు కూడా పండగలాంటి న్యూస్. అయితే బాలకృష్ణ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అది సినిమాతో కాదు.. అన్ స్టాపబుల్ షో తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలయ్యతో అల్లు అరవింద్.. అన్ స్టాపబుల్ సీజన్ 3 ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలయ్య బాబు ఇటీవల కాలంలో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు సినిమాల పరంగా కానీ... ఇటు రాజకీయాల పరంగా కానీ.. ఆయన బిజి బిజిగా గడుపుతున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు అరెస్టుతో ఆయన రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. స్కిల్ డెవల్మెంట్ కుంభకోణంలో నిందితుడిగా చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఇటీవల బాలయ్య పవన్ కల్యాణ్, లోకేష్ తో కలిసి వెళ్లి చూసి వచ్చాడు.

ఆ విషయం పక్కన పెడితే... బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజిగా ఉన్నాడు. అటు తన బావ అరెస్టు అయినప్పటికీ... ఇటు తనను నమ్ముకున్న వారిని వదలకుండా సినిమా కంప్లీట్ చేస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇక భగవంత్ కేసరి అక్టోబర్ 19కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బాబీ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. బాబీ సినిమా పూర్తి చేయాలంటే మరో ఆరునెలలు కేటాయించాలి.
కాబట్టి.. ఎలక్షన్స్ తర్వాత సినిమా చేద్దామని బాబీకి బాలయ్య సజెస్ట్ చేశారట. అయితే ఏపీ రాజకీయాల్లో బాలయ్య కీలక పాత్ర వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అన్ స్టాపబుల్ షో తో చంద్రబాబు, బాలయ్య ఓ ఎపిసోడ్ చేస్తే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో అన్ స్టాపబుల్ సీజన్ 3 కూడా ప్లాన్ చేయాలని చూస్తున్నారని మాచారం.

నిజానికి బాలయ్యకు ఇప్పుడు అంతా టైం లేకపోయినా.... హోస్టింగ్ ద్వారా టీడీపీని మళ్లీ అధికారంలోకి రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయని.. బాలయ్యకు కొంతమంది సజెస్ట్ చేయడంతో... బాలయ్య షో హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. ఇక ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో... మూడో షోతో సంచలనం సృష్టించడానికి రెడీ అవనున్నారట.

ఆహాలో అన్ స్టాపబుల్ సీజన్ 3ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట మేకర్స్. అంతేకాదు ఈసారి కేవలం సినిమా ప్రముఖులు కాకుండా ఎక్కువగా రాజకీయాలపై ఫొకస్ చేసి... కేటీఆర్, కేసిఆర్, మెగాస్టార్ చిరంజీవి,పురంధేశ్వరి పలువురు బడా రాజకీయ నేతలను ఈ షోకి పిలిపించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి ఒకే వేదికపై చిరు, బాలయ్య, కేటీఆర్ లాంటి నాయకులు కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











