twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2: పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు పొంచి ఉన్న సమస్య.. భయంతో ముందు జాగ్రత్తగా భారీగా ఖర్చు..

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక ఓటీటీ టాక్ షోలోకి రాబోతూ ఉండడంతో ఆడియన్స్ లో అయితే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అది కూడా నందమూరి బాలకృష్ణ హోస్ట్ ఉన్న అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ తన జీవితంలోని ఎన్నో విషయాల గురించి చర్చించనున్నాడు. సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారబోతోంది. అయితే ఈ ఎపిసోడ్ ను దృష్టిలో ఉంచుకొని ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ముందుగానే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకోసం ముందుగానే భారీగా ఖర్చు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు వచ్చే సమస్యలు ఏంటి? అందుకోసం ఆహా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోబోతోంది? అనే వివరాల్లోకి వెళితే..

    అన్ స్టాపబుల్ షోలో..

    అన్ స్టాపబుల్ షోలో..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ స్టార్ హీరో అన్ స్టాపబుల్ షోలో కనిపిస్తూ ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువ స్థాయిలో పెరిగిపోయాయి. అది కూడా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న షో కావడంతో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ గా మారుతోంది.

    రెండు భాగాలుగా..

    రెండు భాగాలుగా..

    నందమూరి బాలకృష్ణ ఎదురుపడి మాట్లాడకున్న సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యంగా ఇలాంటి షోలలో వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే చూడాలని ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి బాలయ్య బాబు పిలుపుతో పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో లోకి వస్తూ ఉండడం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

     భారీ స్థాయిలో ప్రమోషన్స్

    భారీ స్థాయిలో ప్రమోషన్స్

    మొదటి భాగాన్ని ఫిబ్రవరి మూడో తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక షో ప్రీమియర్స్ కు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆహా కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే హైదరాబాదులో కొన్ని ఏరియాలలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక విధంగా మహేష్ బాబు ప్రభాస్ వచ్చినప్పుడు కూడా ఆహా ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేయలేదు.

     అప్పుడే ఊహించని నష్టం

    అప్పుడే ఊహించని నష్టం

    అయితే ఆహా అన్ స్టాబాబుల్ షోకు ఉన్న హైప్ కారణంగా ఆహా ఒక సమస్య కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే క్రమంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో యాప్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. దీంతో చాలామంది ఆహా సబ్ స్క్రిప్షన్ తీసుకోకుండానే వెనుదిరిగారు. ఇక అంతలోపే పవన్ ఎపిసోడ్ వీడియో మొత్తం కూడా ఇంటర్నెట్ లో పైరసీగా లీక్ అయ్యింది. దీంతో ఆహా భారీ స్థాయిలో నష్టాలు చూడాల్సి వచ్చింది.

    భయంతో ముందుజాగ్రత్త

    భయంతో ముందుజాగ్రత్త

    అయితే ఈసారి అలాంటి ప్రభావం పడకుండా ఆహా టీం భారీ స్థాయిలో ఖర్చు చేసి మరి ప్రత్యేకంగా ఒక యాప్ సెక్యూరిటీ టీన్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎంతమంది సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి రెడీ అయినా కూడా యాప్ క్రాష్ అవ్వకుండా అప్డేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పైరసీ ప్రభావం పడకుండా కూడా ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు సమాచారం. మరి ఈసారి స్ట్రీమింగ్ కాబోయే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Unstoppable with nbk 2 aha special Caring for pawan kalyan first episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X