Unstoppable 2: పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు తప్పించుకున్న త్రివిక్రమ్.. క్లారిటీ ఇచ్చిన క్రిష్
నందమూరి బాలకృష్ణ హోస్టుగా రెండవ సీజన్ అన్ స్టాపబుల్ ఆఖరి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక మొదటి భాగంకు మంచి రెస్పాన్స్ రావడంతో రెండవ పార్ట్ కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంటోంది. ఇక సెకండ్ పార్ట్ లో బాలయ్య బాబు అనేక విషయాల గురించి పవన్ కళ్యాణ్ తో చర్చించాడు. ముఖ్యంగా అయితే ఈ ఎపిసోడ్ కు త్రివిక్రమ్ కూడా రావాల్సింది. కానీ ఆయన ఊహించని విధంగా ఎస్కేప్ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయం గురించి దర్శకుడు కృషి కూడా పరోక్షకంగా క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ వివరాలలోకి వెళితే..

అదే తరహా క్రేజ్
బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఇప్పటివరకు చాలామంది స్టార్స్ తో మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో మాత్రం అంతకుమించి అనేలా క్రేజ్ అందుకుంటున్నారు అని చెప్పవచ్చు. ఈ ఎపిసోడ్ కోసం రెండు వర్గాల అభిమానులు ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ కు అత్యధిక స్థాయిలో వ్యూవ్స్ రాగా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంటుంది.

హ్యాండ్ ఇచ్చిన త్రివిక్రమ్?
ఇక పవన్ కళ్యాణ్ సెకండ్ పార్ట్ లో త్రివిక్రమ్ కూడా రావాల్సిందిగా బాలయ్య ముందుగానే అడిగారు. అయితే త్రివిక్రమ్ కూడా తప్పకుండా వస్తాను అని మొదట క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే వారిద్దరిని కూడా సెకండ్ పార్ట్ ఎపిసోడ్లో హైలెట్ చేయాలని అనుకున్నారు. కానీ ఆయన చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

పులి, సింహం మధ్యలో నా తల
ఇక త్రివిక్రమ్ రాకపోయినా కూడా దర్శకుడు క్రిష్ ఈ ఎపిసోడ్ లోకి వచ్చాడు. ముందుగా క్రిష్ రాగానే బాలయ్య మా ఇద్దరితో సినిమాలు చేశావు కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. ఒక పులి, సింహం మధ్యలో నా తల ఉంది అంటూ క్రిష్ అయితే చాలా భయపడుతున్నట్లుగా సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా షూటింగ్లో డైరెక్షన్ చేసినప్పుడు భయం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఇలా కూర్చున్నందుకు మాత్రం కాస్త భయంగా ఉంది అని చెప్పాడు.

త్రివిక్రమ్ తప్పించుకున్నాడు అంటూ..
అయితే క్రిష్ భయపడుతూనే త్రివిక్రమ్ గారు ఎందుకు రాలేదో ఇప్పుడు తనకు అర్థమైంది అని కూడా కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పేశాడు. ఈ విధంగా ఇద్దరు నన్ను ర్యాగింగ్ చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని త్రివిక్రమ్ గారు చాలా తెలివిగా తప్పించుకున్నారు అని చెప్పకనే చెప్పేశాడు. ఒక విధంగా త్రివిక్రమ్ అయితే ఇలాంటి టాక్ షోలతో పాల్గొనడానికి కూడా పెద్దగా ఇష్టపడడు. ఇక ఇలాంటి వాటికి అతను చాలా దూరంగా ఉంటాడు అని మరోసారి అర్థమైంది.

అందుకే రాలేదు..
త్రివిక్రమ్ వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం గురించి అడగడం సంగతి పక్కన పెడితే కొన్ని కాంట్రవర్సీ విషయాల గురించి కూడా అడిగే అవకాశం లేకపోలేదు ఇక త్రివిక్రమ్ వాటి గురించి ఆలోచించకుండా ఉండాలి అని అనవసరంగా మళ్ళీ వార్తల్లో నిలవకూడదు అని కారణం చేతనే అన్ స్టాపబుల్ షోలోకి రాలేదు అని తెలుస్తోంది. ఇక క్రిష్ బాలయ్య బాబు అడిగిన ప్రశ్నలు కొంత ఇబ్బందిగానే అనిపించాయి. ఇక త్రివిక్రమ్ ఎందుకు రాలేదో అర్థమైంది అని క్రిష్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కు కూడా ఆ విషయం అర్థమైపోయింది.


Click it and Unblock the Notifications











