Unstoppable With Nbk 2: నేను చీకట్లో.. మనిద్దరం కలిస్తే పున్నమి రాత్రే.. హీరోయిన్ తో బాలయ్య
నందమూరి బాలకృష్ణ సెకండ్ సీజన్ చంద్రబాబు నాయుడితో గ్రాండ్ గా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక మొదటి ఎపిసోడ్ తర్వాత స్ట్రీమింగ్ కాబోయే ఎపిసోడ్స్ పై ఒక్కసారిగా అంచనాల పెరిగిపోయాయి. ఇక సెకండ్ సీజన్ రెండో ఎపిసోడ్లో ఇద్దరు యువహీరోలు పాల్గొన్నారు. వారితో బాలయ్య బాబు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అలాగే వారి హీరోయిన్స్ తో కూడా బాలయ్య చాలా రొమాంటిక్ గా అల్లరి చేసే ప్రయత్నం చేశాడు. లేటెస్ట్ గా ప్రోమో కూడా రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..

యువ హీరోల సందడి
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మొదలైన ఆహా అన్ స్టాపబుల్ షో సీజన్ 1 మంచి క్రేజ్ అందుకుంది. ఇక రెండవ సీజన్లో కూడా అదే ఊపులో ఆకట్టుకోవడానికి బాలయ్య సిద్ధమయ్యారు. సీజన్ 2 రెండో ఎపిసోడ్లో ఇద్దరూ హీరోలు అడుగుపెట్టారు. ఒకరు విశ్వక్ సేన్.. మరొకరు సిద్దు జొన్నలగడ్డ. ఇటీవల కాలంలో ఈ ఇద్దరు హీరోలు కూడా మంచి ఎనర్జీతో సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బాలయ్యతో వాళ్ళు షోలో ఎంతగానో సందడి చేశారు.

గాడ్ ఆఫ్ మాస్
ఒకరేమో మాస్ కా దాస్, మరొకరేమో మాస్ కా బాస్ అంటూ ఇద్దరి హీరోలను పొగిడిన బాలకృష్ణ.. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గాడ్ ఆఫ్ మాస్ అంటూ తన గురించి చెప్పుకున్నారు. దీంతో ఆడియన్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టేశారు. సిద్దు జొన్నలగడ్డ విశ్వక్ కూడా ఒక్కసారిగా నవ్వేశారు. ఇక సిద్దు జొన్నలగడ్డ అలాగే విశ్వ ఇద్దరు కూడా పార్టీల గురించి కూడా మాట్లాడుకున్నారు.

ఫ్లర్ట్ చేయడానికి టిప్స్
అలాగే సరదాగా ఒక్క అమ్మాయికి ఫోన్ చేద్దామని చెప్పిన బాలయ్య అలాగే ఫ్లర్ట్ చేయడానికి టిప్స్ కూడా ఇవ్వాలి అని అడగడంతో అందుకు సిద్దు జొన్నలగడ్డ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొదట చిన్నగా పొగడాలని ఆ తర్వాత జుట్టు ఎదో కొంచెం వేరేగా ఉంది అని రైట్ సైడ్ దువ్వుకోవాలి అని చెబితే సరిపోతుంది అని అన్నాడు. ఇక పక్కనే ఉన్న విశ్వక్ నువ్వు వెళ్లి దువ్వుతావా విశ్వక్ సెటైర్ వేశాడు.

చెమటలు పట్టిస్తున్నారు
ఇక బాలయ్య బాబును ఇప్పుడు మీ క్రష్ ఎవరు అని కూడా అడిగేసారు. దీంతో బాలయ్య బాబు తడబడకుండా రష్మిక మందన్న అని సమాధానం ఇచ్చారు. ఇక తర్వాత దబిడి దిబిడే అనే ఆట కూడా ఆడించారు. విశ్వక్ అయితే బాలయ్య బాబు స్పీడ్ ను చూసి ఆశ్చర్యపోయాడు. చెమటలు పట్టిస్తున్నారు అని కూడా అనేశాడు.
ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రి
ఇక తర్వాత బాలకృష్ణ ఆ హీరోలు నటించిన ఒక హీరోయిన్ కు ఫోన్ చేశారు. గొంతు విని మొహం ఎలా ఉంటుందో చెప్పగలను అని ఆ హీరోయిన్ తో మాట్లాడారు. తప్పకుండా నువ్వు చందమామలా ఉంటావు అని కూడా బాలయ్య బాబు చెప్పడంతో ఇద్దరు హీరోలు ఆశ్చర్యపోయారు. అలాగే నేను చీకట్లో ఉంటాను మన ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రి అని కూడా అనడంతో విశ్వక్ అయితే షాక్ అయ్యాడు.
ఆ తర్వాత సిద్దు పక్కనే వచ్చి కూర్చుంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం నువ్వు పక్కకు వేళ్ళు అంటూ బాలయ్య జోక్ చేశాడు. మొత్తం సందడిగా కొనసాగిన అన్ స్టాపబుల్ షో కేవలం ప్రోమోతోనే ఇంతగా ఆకట్టుకుంది అంటే ఇక ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో హైలెట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











