Don't Miss!
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రభాస్ గురించి మరో లీక్ బయటపెట్టిన బాలయ్య.. గోపిచంద్ కోసం ప్రాణాలు ఇస్తానని..
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు కూడా గెస్ట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక మొదటి ఎపిసోడ్ ను న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఆహా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ లో గోపీచంద్ ను హైలెట్ చేస్తూ మరొక ఎపిసోడ్ విడుదల చేశారు. అయితే ఈ క్రమంలో బాలయ్య బాబు ఇద్దరు హీరోలతో మరింత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గోపిచంద్ మరో లీక్ పై కన్నుకొట్టి మరి క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నువ్వే నిజాలు చెప్పాలి
మొదట గోపీచంద్ రాగానే రామ్ చరణ్ లీక్ చేసిన విషయం గురించి బాలయ్య సరదాగా చెప్పుకొచ్చారు. ప్రభాస్ గురించి నువ్వే నిజాలు చెప్పాలి అని బాలయ్య నవ్వుతూ అడిగారు. అంతే కాకుండా రామ్ చరణ్ ఒక చిన్న హింట్ ఇచ్చాడు అని ఎవరో రాణి అంటూ ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు అని బాలయ్య బాబు గోపీచంద్ తో చెప్పాడు. ఇక గోపీచంద్ కూడా అవును అంటూ ప్రభాస్ కు మరింత కోపం వచ్చేలా చేసాడు.

సగం సగం చెప్పకు
ఇక ప్రభాస్ కొంత నవ్వుతూనే మరొకవైపు ఆగ్రహంతో గోపీచంద్ ను చెబితే పూర్తిగా చెప్పు సగం సగం చెప్పకు అంటూ మరో కౌంటర్ అయితే ఇచ్చాడు. ఇక గోపీచంద్ అయితే వచ్చే ఏడాది అయిపోతుంది అని మరొక విధంగా మాట్లాడడంతో ఏమైపోతుంది అంటూ బాలయ్య అడిగాడు. ఇక తర్వాత ప్రభాస్కు మరొక అడుగు ముందుకేసి గోపీచంద్ దేనితో ఆయన కొట్టడానికి రెడీ అయ్యాడు.

నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డుగా..
ఇక ప్రభాస్ ఆ విధంగా చేయడంతో నందమూరి బాలకృష్ణ గోపీచంద్ కు అడ్డుగా ఉన్నాడు. నువ్వు అతన్ని ఎందుకు బెదిరిస్తున్నావు అతన్ని నిజం చెప్పని అంటూ బాలయ్య బాబు కూడా ప్రభాస్ తో చెప్పాడు. ఇక గోపీచంద్ ముందు ఉన్న బాలయ్య బాబు నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను అని నువ్వు చెప్పేది ఏదో చెప్పు అని సపోర్ట్ చేశాడు.

హీరోయిన్ కోసం కొట్టుకున్నారు
ఇక గోపీచంద్ మళ్ళీ కన్ను కొడుతూ వచ్చే ఏడాదికి అయిపోతుంది అని మరొక విధంగా మాట్లాడడంతో ప్రభాస్ కొంత నవ్వుతూ నువ్వు కూడా నా పరువు తీయకు రా అని సరదాగా మాట్లాడాడు. ఇక తర్వాత మీ ఇద్దరూ ఎవరో హీరోయిన్ కోసం కొట్టుకున్నారు అని అది ఎప్పుడు అని బాలయ్య బాబు ఒక ప్రశ్న వేశాడు. ఇక గోపీచంద్ ఆలోచిస్తూ మీరు అన్నట్లు 2008 కాదు సార్ 2004లో అనుకుంటాను అనే గోపీచంద్ ఆలోచిస్తూ చెప్పాడు.

తెలివిగా ట్విస్ట్ ఇచ్చిన గోపిచంద్
ఇక గోపీచంద్ చెప్పిన ఆన్సర్ కు ప్రభాస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వర్షం సినిమాలో త్రిష కోసం మేము ఇద్దరం కొట్టుకున్నాము అని చెప్పాడు. అందులో అతను హీరో నేను విలన్ అని చాలా తెలివిగా సమాధానం చెప్పడంతో బాలయ్య బాబు ఒంగోలు తెలివితేటలు అని అని మళ్లీ నవ్వుతూనే మరొక కౌంటర్ ఇచ్చాడు. ఇక గోపీచంద్ అలా సమాధానమివ్వడంతో ప్రభాస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనోడు చాలా గ్రేట్ సార్ చాలా తెలివివంతుడు అని అతన్ని పొగుడుతూ చెప్పాడు.