Unstoppable 2: పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో గెస్ట్ గా మరో హీరో.. పంచెకట్టులో సర్‌ప్రైజ్.. ఫొటో వైరల్!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్భీకే సీజన్ 2 లో ఈసారి ఊహించని స్థాయిలో సెలబ్రిటీలు వస్తూ ఉండడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలకు కూడా ఇదివరకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు కూడా ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో మరో హీరో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

విబేధాలపై క్లారిటీ

విబేధాలపై క్లారిటీ

పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ మధ్యలో విభేదాలు ఉన్నాయని రాజకీయపరంగా సినిమాల పరంగా కూడా వీరి మధ్యలో కొంత గ్యాప్ ఉంది అని చాలా రోజులుగా కొన్ని కథనాలు వినబడుతున్నాయి. అయితే మొత్తానికి గాసిప్స్ కు ముగింపు కార్డు పెట్టడానికి ఈ స్టార్ హీరోలు ఇద్దరు కూడా అన్ స్టాపబుల్ షోలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా పూర్తయింది.

 ఈసారి అలా జరగకుండా..

ఈసారి అలా జరగకుండా..

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ రెండవ సీజన్లో ఇదివరకే ప్రభాస్ రావడంతో చాలామంది అభిమానుల నుంచి కూడా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అప్పుడే ఆహా యాప్ కూడా జనాల తాకిడికి తట్టుకోలేక ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. అయితే ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి అని ఆహా టెక్నికల్ టీం సిద్ధమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం మరింత ఎక్కువ స్థాయిలో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆ విషయంలో పవన్ వివరణ

ఆ విషయంలో పవన్ వివరణ

బాలకృష్ణ అలాగే పవన్ కళ్యాణ్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అని ముందుగానే ఊహించిన ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రాజకీయ అంశాలతో పాటు తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి కూడా క్లారిటీ ఇవ్వబోతున్నాడు. అలాగే పర్సనల్ గా రాజకీయ నాయకులు టార్గెట్ చేయడంపై కూడా పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ లో స్పందించబోతున్నట్లు తెలుస్తోంది.

 పవన్ మేనల్లుడు కూడా..

పవన్ మేనల్లుడు కూడా..

అయితే అన్ స్టాపబుల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరొక యువ హీరో కూడా కనిపించబోతున్నాడు. అసలైతే ఈ ఎపిసోడ్ కు త్రివిక్రమ్ వస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాత్రం వచ్చినట్లు ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ రీమేక్ పై కూడా క్లారిటీ

ఆ రీమేక్ పై కూడా క్లారిటీ

పంచె కట్టులో చాలా డీసెంట్ గా కనిపించిన సాయిధరమ్ తేజ్ నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ముందు నిలబడి ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తన మేనల్లుడితో కూడా కొన్ని విషయాలపై బాలకృష్ణతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరి కలయికలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తమిళంలో సక్సెస్ అయిన వినోదాయ సీతం రీమేక్ కథను వీరు ఇద్దరు చేయబోతున్నారు. ఆ విషయంపై కూడా బాలయ్య బాబు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X