Unstoppable 2: పవన్ తో మల్టీస్టారర్ పై బాలయ్య క్లారిటీ.. స్టోరీ సిద్ధమన్న దర్శకుడు!
ఇటీవల కాలంలో స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇటీవల నందమూరి మెగా హీరోల కాంబినేషన్లో వచ్చిన RRR సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా మెగా హీరోలతో కలిసి నటిస్తే చూడాలి అని ఇరువర్గాల అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ బాలకృష్ణ నటిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అన్ స్టాపబుల్ షోలో బాలయ్య బాబు ఒక దర్శకుడికి ఆఫర్ కూడా ఇచ్చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్స్ హ్యాపీ
నందమూరి బాలకృష్ణ ఎంటర్టైన్మెంట్ టాక్ షో ఆన్ స్టాపబుల్ పేరుకు తగ్గట్టుగానే మంచి గుర్తింపు అందుకుంటోంది. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఈ టాక్ షో స్థాయి మరింతగా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ రెండు భాగాల్లో వచ్చిన ఎపిసోడ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ తనలోని ఎన్నో అంశాలను బాలయ్యతో షేర్ చేసుకున్నాడు. ఇక వీరు ఆ విధంగా మాట్లాడుకోవడం ఫ్యాన్స్ కు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది.

క్రిష్ ను ఆటపట్టించిన బాలయ్య
పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఈ టాక్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక కొద్దిసేపటి వరకు నందమూరి బాలకృష్ణ దర్శకుడు క్రిష్ ను ర్యాగింగ్ చేశాడు. ఇంకా క్రిష్ కూడా కొన్ని ప్రశ్నలకు ఎంతగానో ఆందోళన చెందాడు. ఇక తర్వాత అభిమానుల్లో కూర్చున్న క్రిష్ పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్న కొన్ని విషయాల గురించి కూడా సమాధానాలు ఇచ్చాడు.

ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు
బాలకృష్ణ ప్రతి గెస్ట్ కు కూడా తనదైన శైలిలో ఒక గేమ్ పెడుతూ ఉంటారు. ఫ్యాన్స్ కు అలాగే హీరోలకు మధ్య ఎలాంటి అనుబంధం ఉంది అని విషయాన్ని కూడా హైలెట్ చేస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి అని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు ఒక పరీక్ష పెట్టారు.

పవన్ మనసులో మల్టీస్టారర్
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని అందులోనూ బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేయాలి అని చాలామంది కోరుకుంటున్నారు అని బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ను ఒక ప్రశ్న అడిగాడు. ఇక పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో కూడా బయటకు చెప్పాలి అని ఒక బోర్డు మీద ఎస్ ఆర్ నో అనేది చూపించాలి అని బాలయ్య బాబు అడిగాడు.

దర్శకుడి నుంచి గ్రీన్ సిగ్నల్
ఇక అక్కడ కూర్చున్న ఫ్యాన్స్ అందరూ కూడా తప్పకుండా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా రావాలి అని కోరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన మనసులోని మాటను ఎస్ అని బయటకు చెప్పాడు. ఇక బాలయ్య బాబు వెంటనే అభిమానుల్లో కూర్చున్న దర్శకుడు క్రిష్ కు కూడా ఆ విషయం చెప్పగా.. కథ కూడా సిద్ధమే అంటూ క్రిష్ కూడా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి వీరి కాంబినేషన్లో భవిష్యత్తులో సినిమా ఉంటుందో లేదో మళ్ళీ వారే క్లారిటీ ఇవ్వాలి.


Click it and Unblock the Notifications











