Unstoppable 2: రాజమౌళి దగ్గర ప్రభాస్ అప్పుల గురించి చెప్పుకొని.. ఎవరికి తెలియని నిజం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత ప్రేక్షకులను చాలా విభిన్నంగా ఆకట్టుకున్నాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్నటువంటి అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్ ఎంతో ఎనర్జీటిక్ గా మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. తనలోని మరో కోణాన్ని చూపించిన ప్రభాస్.. ఒకసారి కనెక్ట్ అయితే ఎంత క్లోజ్ గా ఉంటాడో కూడా చాలా క్లారిటీగా అర్థమయింది. అయితే ఈ షోలో ప్రభాస్ తన అప్పుల గురించి చెప్పుకోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఒక రోజు ముందుగానే..
అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఎదురు చూశారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలైతే డిసెంబరు 30వ తేదీన మొదటి భాగాన్ని స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడంతో అంతకంటే ఒక రోజు ముందుగానే ఈ ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. అయితే జనాలు ఒక్కసారిగా ఎపిసోడ్ చూసేందుకు ఎగబడడంతో ఆహా సర్వర్ మొత్తం క్రాష్ అయిపోయింది.

అప్పుల వలన..
మొత్తానికి ఫ్యాన్స్ అయితే ఈ ఎపిసోడ్ ను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అనిపిస్తుంది. ఒక ప్రభాస్ తన జీవితంలోని ఎన్నో విషయాలను కూడా ఈ షో ద్వారా బయటపెట్టాడు. అయితే ఒకానొక సమయంలో తన అప్పుల గురించి కూడా ప్రభాస్ ఇబ్బంది పడినట్లు అనిపించింది. అంతేకాకుండా అప్పుల కోసమే చక చకా సినిమాలు కూడా సెట్స్ పైకి తీసుకువచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు.

యువీ క్రియేషన్స్ ప్రస్తావన
ప్రభాస్ యూవి క్రియేషన్స్ ను తన మిర్చి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. తన సోదరుడు ప్రమోద్ అలాగే స్నేహితుడు వంశీ ఇద్దరినీ కలిపి ఆ సంస్థను ముందుకు కొనసాగిస్తున్నాడు. మిర్చి సినిమా అనుకోకుండా సెట్స్ పైకి వచ్చింది అని అయితే అప్పుడే రాజమౌళితో బాహుబలి సినిమా కూడా చేసేందుకు ఒప్పుకున్నాను అని ప్రభాస్ చెప్పాడు.

అప్పుల కోసం రాజమౌళితో చెప్పా
చత్రపతి సినిమా తర్వాత మరో సినిమా చేయాలని రాజమౌళి ఎప్పుటి నుంచో అనుకుంటున్నాడు. అయితే మొత్తానికి బాహుబలి గురించి చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అయితే ఆ సినిమా కోసం చాలా టైం కేటాయించాలని ఏ సినిమా మధ్యలో చేయకూడదని అనుకున్నాను. అందుకే రెబల్ తర్వాత మళ్లీ మరొక సినిమా చేసే అవకాశం రావడంతో మొదట రాజమౌళిని అడిగాను. కొన్ని అప్పులు ఉన్నాయి అని మిర్చి సినిమా చేయొచ్చు అంటారా అని అడిగాను.

ఆలస్యం అవుతుంది కాబట్టి
అయితే బాహుబలి ఇంకా అప్పుడు స్క్రిప్ట్ దశలోనే ఉండడంతో ఎలాగు కొంత టైం పడుతుంది కాబట్టి మరో సినిమా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పాడు. అంతకంటే ముందే వారి సతీమణి రామా రాజమౌళి గారిని అడిగినప్పుడు ఎలాగు ఆయన చాలా ఆలస్యం చేస్తారు కాబట్టి నువ్వు హ్యాపీగా ఒక సినిమా పూర్తి చేయవచ్చు అని కూడా భరోసా ఇచ్చినట్లుగా ప్రభాస్ నవ్వుతూ చెప్పకొచ్చాడు.


Click it and Unblock the Notifications











