Unstoppable 2: ఫస్ట్ టైమ్ ఆ ఘటనలపై బాలకృష్ణతో ప్రభాస్, గోపిచంద్ చర్చ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 మరో రేంజ్ కు వెళ్లే ఎపిసోడ్ రాబోతోంది. ఇప్పటికే దర్శకులు స్టార్ హీరోలు చాలామంది ఈ షోలోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ తీసుకొచ్చారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలకృష్ణ కోసం నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ట్ తో పాటు మరో యాక్షన్ హీరో కూడా రాబోతున్నాడు. అందులో బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నాడు. అలాగే ఇప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది.. అనే వివరాల్లోకి వెళితే..

ప్రాణస్నేహితులతో..
నందమూరి బాలకృష్ణ కేవలం స్టార్ హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా మెప్పించగలడు అని అన్ స్టాపబుల్ షూట్ ద్వారా నిరూపించాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ టాక్ షో ముందుకు కొనసాగుతోంది. అయితే రాబోయే ఎపిసోడ్స్ మాత్రం మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు అతని అత్యంత సన్నిహిత స్నేహితుడు గోపీచంద్ కూడా ఈ టాక్ షోలో ముచ్చటించబోతున్నాడు.

ఇలాంటి వారు వస్తే..
గోపీచంద్ ప్రభాస్ ముందు నుంచి కూడా మంచి స్నేహితులు. వారు ఇద్దరు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు చాలా క్లోజ్ గా కూడా తిరిగారు. అయితే ప్రభాస్ ఫ్యాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళినప్పటికీ కూడా అతని స్నేహాన్ని మాత్రం కొంచెం కూడా విడిచిపెట్టలేదు. ఇక గోపీచంద్ అయితే రెగ్యులర్ గా అతనితో కలుస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి వారిని అన్ స్టాపబుల్ లోకి పిలిస్తే మాత్రం ఆహా వ్యువర్షిప్ మాత్రం మరొక రేంజ్ లో ఉంటుంది అని చెప్పవచ్చు.

ఆ విషయంలో బాలయ్య ప్రశ్నలు
అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అనే విషయంలో ఇప్పుడు అందరి ఫోకస్ ఒక విషయం పైన పడింది. ముఖ్యంగా ప్రభాస్ ఇప్పటివరకు తన పెదనాన్న చనిపోయిన తర్వాత పెద్దగా ఎక్కడా కూడా ఆ విషయం గురించి పెద్దగా స్పందించలేదు. కానీ ఈ షోలో మాత్రం తన పెదనాన్నతో అనుబంధాన్ని ప్రత్యేకంగా వివరించబోతున్నట్లుగా తెలుస్తోంది.

పెళ్లి విషయం
అలాగే ప్రభాస్ పర్సనల్ లైఫ్ విషయాలలో చాలామంది అభిమానులు ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే విషయంలో ఎన్నో రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలకృష్ణ ఆ విషయంలో కూడా కొన్ని ప్రశ్నలు అడగబోతున్నట్లుగా తెలుస్తోంది.

బాలయ్య కోసమే..
ఇక ప్రభాస్ గోపీచంద్ లతో నేడే రామానాయుడు స్టూడియోలో అన్ స్టాపబుల్ ఫుల్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేయబోతున్నారు. ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా ఈ షో కి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక షో అయిపోయిన వెంటనే అతను ప్రాజెక్ట్ K షూటింగ్ కి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇక ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయంలో కూడా ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. లేదంటే న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న కూడా ఈ ఎపిసోడ్ ను ఆహా ఓటీపీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ప్రోమో వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











