Unstoppable 2: బాలయ్య కోసం టాక్ షోలోకి ప్రభాస్.. ఆ ప్లాన్ ప్రకారం అయితే రావాలి.. కానీ.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ కొనసాగుతున్న అన్ స్టాపబుల్ విత్ NBL సీజన్ 2 అంచనాలకు తగ్గట్టుగానే ముందుకు కొనసాగుతోంది. ఒక విధంగా ఈ షో ద్వారానే ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు మంచి క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. ఆహా ఓటీటీ లెవెల్ మరో రేంజ్ కు వెళ్లే విధంగా అల్లు అరవింద్ చేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. ఇక త్వరలోనే ఈ టాక్ షోలోకి మరి కొంతమంది పెద్ద హీరోలు రాబోతున్నారు. అందులో ప్రభాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వస్తున్న టాక్ ప్రకారమైతే ఆహా టీం ప్రభాస్ ను సంప్రదించరట. ప్లాన్ ప్రకారమైతే రావాలి కానీ ఒక సమస్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సక్సెస్ కావడంతో..

సక్సెస్ కావడంతో..

నందమూరి బాలకృష్ణ మొదటి సీజన్ నుంచి కూడా చాలా ఎనర్జీతో ఈ షోను ముందుకు కొనసాగిస్తున్నాడు. అసలైతే కేవలం ఆయన ఒక సీజన్ తోనే ముగించాలని ఆ తర్వాత మళ్లీ చేయకూడదు అని అనుకున్నారు. కానీ మొదటి అన్ స్టాపబుల్ బాగా సక్సెస్ కావడంతో రెండవ సీజన్ కోసం మరోసారి హోస్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు. అంతేకాకుండా పారితోషికం కూడా పెంచినట్లు టాక్ వచ్చింది. ఇక రెండవ సీజన్లోకి మరి కొంతమంది అగ్ర హీరోలు రాబోతున్నారు.

ఎన్నో సరదా మూమెంట్స్

ఎన్నో సరదా మూమెంట్స్

ఈసారి రెండో సీజన్లో బాలయ్య చంద్రబాబు నాయుడు, లోకేష్ తో మొదలు పెట్టిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఎపిసోడ్లో ఎన్నో సరదా మూమెంట్స్ తో పాటు పలు కాంట్రవర్సీ పొలిటికల్ అంశాలపై కూడా బాలయ్య ఓపెన్ గా స్పందించడం హైలైట్ అయింది. అందుకే ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా షోలోకి ఆహ్వానించారు దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మొదటిసారి ఇలా..

మొదటిసారి ఇలా..

ఇక ఇటీవల ఈ టాక్ షోలో మొట్టమొదటిసారి చాలా ఎక్కువ మంది సెలబ్రిటీలు రావడం కూడా హైలెట్ గా నిలిచింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు నిర్మాతలు ఇద్దరు అగ్ర దర్శకులు అన్ స్టాపబుల్ షోలోకి వచ్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు సురేష్ బాబు తో పాటు ప్రముఖ దర్శకులు కే.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి కూడా ప్రత్యేక అతిథులుగా వచ్చారు.

ప్రభాస్ కూడా..

ప్రభాస్ కూడా..

అయితే త్వరలోనే ప్రభాస్ కూడా అన్ స్టాపబుల్ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ప్లాన్ ప్రకారం అల్లు అరవింద్ ముందుగానే ఈ విషయం గురించి ప్రభాస్ తో మాట్లాడాడు. ఎందుకంటే జనవరిలో ఆదిపురుష్ సినిమా విడుదల ఉంటుంది కాబట్టి ఆ చిత్ర యూనిట్ సభ్యులతో ఒక ఎపిసోడ్ ని షూట్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా షూటింగ్ వాయిదా పడడంతో మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

బిజీగా ఆ పనుల్లో ప్రభాస్..

బిజీగా ఆ పనుల్లో ప్రభాస్..

ప్రస్తుతం ప్రభాస్ అయితే చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఆదిపురుష్ సినిమా వాయిదా పడడంతో దానికి సంబంధించిన రీవర్క్ చర్చల్లో కూడా పాల్గొంటున్నాడు. కాబట్టి చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పవచ్చు. దానికి తోడు అతిపెద్ద ప్రాజెక్టు K కూడా సెట్స్ పై ఉంది. ప్రభాస్ ముందైతే ఈ షోలోకి రావడానికి ఆసక్తిని చూపించాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అతను రావడం అనేది కాస్త డౌట్ గానే ఉంది. ఏదేమైనా కూడా ఈసారి రెండవ సీజన్ ను అతిపెద్ద స్టార్ తో ముగించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రభాస్ వస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X