Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2: ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని భయపెట్టిన చరణ్.. చిచ్చు పెట్టిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్నటువంటి అన్ స్టాపబుల్ సీజన్ 2 మరింత ఆసక్తిగా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ చూసిన జనాలు ఈ షోకు మరింత దగ్గరయ్యారు అనే చెప్పాలి. షో మొదలయ్య కంటే ముందే ఆహా యాప్ కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొంతసేపటి వరకు క్రాస్ అయిపోయింది. అయితే మొత్తానికి ఈ ఎపిసోడ్లో అన్నిటికంటే ఎక్కువగా రామ్ చరణ్ ఫోన్ కాల్ మాత్రం చాలా హైలెట్గా నిలిచింది. వారి సంభాషణ మధ్యలో బాలయ్య బాబు క్రియేట్ చేసిన ఫన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఒక విధంగా బాలయ్య బాబు సరదాగా చిచ్చు పెట్టినట్లు కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే..

మా ఫామ్ హౌస్ లో పార్టీ
ప్రభాస్ చాలా కాలం తర్వాత టాక్ షోలోకి వచ్చి ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ ఎంత ఫ్రీగా ఉంటాడో ఈ షో ద్వారా మరోసారి క్లారిటీగా అర్థమయింది. ఇక నందమూరి బాలకృష్ణ నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలి అని అనగానే.. డార్లింగ్ సార్ అంటూ తన మర్యాదను చూపించాడు. అంతేకాకుండా తప్పకుండా మిమ్మల్ని ఫామ్ హౌస్ కి పిలుస్తాను అని మీ మాన్షన్ హౌస్ తోనే పార్టీ చేసుకుందాం అంటూ కూడా ప్రభాస్ వివరణ ఇవ్వడం విశేషం.

రామ్ చరణ్ ఫోన్ కాల్
ఇక ప్రభాస్ గేమ్ లో భాగంగా ముందుగా రామ్ చరణ్ కు ఫోన్ చేయాలి అని బాలయ్య బాబు సూచించారు. ఇక రామ్ చరణ్ కు ఫోన్ చేయగానే బాలకృష్ణ ఫోన్ అందుకుంటూ ప్రభాస్ గురించి ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పాలి అని అన్నారు. ఇక ప్రభాస్ అయితే పక్కనే ఉంటూ కాస్త చూసి మాట్లాడు డార్లింగ్ అని బ్రతిమాలుకున్నాడు.

గుడ్ న్యూస్ అంటూ..
కానీ బాలయ్య బాబు మాత్రం ఏదో ఒక విషయం చెప్పాల్సిందే అంటూ రామ్ చరణ్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో రామ్ చరణ్ కొద్దిసేపు సరదాగా ఏడిపించే విధంగా చేశాడు. త్వరలోనే ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాడని బాలయ్య బాబుకు చెప్పడంతో ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అయితే ఆ గుడ్ న్యూస్ ఏమిటి అనేది రామ్ చరణ్ చెప్పకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.

అల్లుకుపోతాను అంటూ
అయితే ఆ గ్యాప్ ఎందుకు ఇస్తున్నావు అంటూ ఆ విషయం ఏదో పూర్తిగా చెప్పు అంటూ ప్రభాస్ ఫోన్లోనే రామ్ చరణ్ చాలా బ్రతిమాలుకున్నాడు. గుడ్ న్యూస్ అంటే మళ్ళీ దాంట్లో ఏదేదో మాట్లాడుకుంటారు అని ఇప్పటికే చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి అని ప్రభాస్ రామ్ చరణ్ తో మాట్లాడాడు. ఇక ఆ మాత్రం హింట్ ఇస్తే నేను అల్లుకుపోతాను అంటూ బాలయ్య బాబు కూడా చెప్పడంతో ప్రభాస్ మరింతగా రామ్ చరణ్ తో మాట్లాడుతూ.. రేపు ఇండియా మొత్తం అల్లుకు పోతుంది అని.. ఆ విషయం ఏదో పూర్తిగా చెప్పు అని సరదాగా బ్రతిమాలాడు.

ప్రభాస్ రివెంజ్
ఇక ప్రభాస్ ఎంత బ్రతిమాలినా కూడా రామ్ చరణ్ గుడ్ న్యూస్ ఏమిటి అనేది చెప్పలేదు. దీంతో ప్రభాస్ రామ్ చరణ్ పై కొంత సరదాగా కొప్పుడుతూ ఒక కౌంటర్ అయితే ఇచ్చాడు. ముందుగా బాలకృష్ణ నువ్వు నా ఎపిసోడ్ కు ఎప్పుడు వస్తున్నావు అని రామ్ చరణ్ ని అడగగానే మీ ఫోన్ కాల్ కోసం వెయిటింగ్ సార్ మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని రామ్ చరణ్ చెప్పాడు. ఇక రాంచరణ్ అలా చెప్పగానే.. చరణ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నాకే ఫోన్ చేయాలి అని, అప్పుడు అతని మీద రివెంజ్ తీర్చుకుంటానని ప్రభాస్ మళ్ళీ సరదాగా వివరణ ఇచ్చాడు.