For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable with NBK 2: బాలయ్య మరో సంచలనం.. ఓటీటీ చరిత్రలోనే తొలి షోగా రికార్డు

  |

  ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇప్పటికే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఆయన.. హీరోగా ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. మూవీలు మాత్రమే కాదు.. వేరే విభాగాల్లోనూ రాణించాలన్న పట్టుదలతో ఉండే బాలయ్య.. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో Unstoppable with NBK Show అనే షోను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదటిసారే అయినా ఎవరూ ఊహించని రీతిలో యాంకర్‌గా అలరించిన బాలయ్య.. షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌ను కూడా మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య షో ఓ సంచలనం సృష్టించింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  అఖండ హిట్‌తో జోష్‌లో బాలయ్య

  అఖండ హిట్‌తో జోష్‌లో బాలయ్య

  నందమూరి బాలకృష్ణ గత ఏడాది 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా భారీ అంచనాలతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. ఇదే ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు.

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

  హోస్టుగా ఎంటరైన నటసింహం

  హోస్టుగా ఎంటరైన నటసింహం

  ఎలాంటి ప్రయోగాలు చేయాలన్నా ముందుండే నందమూరి బాలకృష్ణ.. అరవై ఏళ్ల ఏజ్‌లోనూ సాహసాలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి హోస్టుగా వచ్చారు. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని గత నవంబర్‌లో ఈ టాక్ షోను అంగరంగ వైభవంగా మొదలెట్టారు.

  ఫిదా చేసిన బాలయ్య.. సక్సెస్‌గా

  ఫిదా చేసిన బాలయ్య.. సక్సెస్‌గా

  సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్న బాలకృష్ణ ఏ షోనూ హోస్ట్ చేయలేదు. కానీ, 'Unstoppable with NBK' షోకు మాత్రం ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేశారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరించారు. దీంతో మొదటి సీజన్‌లోని ఎపిసోడ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో షో కూడా సక్సెస్‌ఫుల్ అయిందని తెలిసిందే.

  యాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శన

  రెండో సీజన్‌కు రంగం సిద్ధంగానే

  రెండో సీజన్‌కు రంగం సిద్ధంగానే

  నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన హోస్టుగా వచ్చిన 'Unstoppable with NBK' టాక్ షో మొదటి సీజన్ భారీ స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆహా టీమ్ ఇప్పుడు రెండో సీజన్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచార చిత్రాల కోసం బాలయ్య షూట్‌లో పాల్గొన్నారు.

  సాంగ్ వదిలారు.. ట్రైలర్ రెడీగా

  సాంగ్ వదిలారు.. ట్రైలర్ రెడీగా

  నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్న 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన సాంగ్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం స్పెషల్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

  దీపిక - రణ్‌వీర్ విడాకులు: నగ్నంగా చేసిన పని వల్లే.. హీరోనే స్వయంగా చెప్పడంతో!

  బాలయ్య షోకు స్పెషల్ ఈవెంట్

  బాలయ్య షోకు స్పెషల్ ఈవెంట్

  ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న 'Unstoppable with NBK' రెండో సీజన్‌ గురించి తాజాగా ఆహా టీమ్ ఓ అదిరిపోయే ప్రకటన చేసింది. అందులో ఈ షో కోసం అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి విజయవాడలోని ఆటో నగర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  ఓటీటీ చరిత్రలోనే తొలి షో ఇదే

  ఓటీటీ చరిత్రలోనే తొలి షో ఇదే

  సాధారణంగా సినిమాలకు మాత్రమే విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లను చేస్తుంటారు. కానీ, చరిత్రలోనే తొలిసారి నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్న 'Unstoppable with NBK' టాక్ షోకు ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి షోగా ఇది చరిత్ర సృష్టించింది. దీంతో ఈ రికార్డు కూడా బాలయ్య ఖాతాలోకే వచ్చినట్లు అయింది.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Unstoppable with NBK 2 Show For Aha. Now This Show Got 5th Place in IMDB Top 10 Rankings.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X