Unstoppable Season 4: బాలయ్య తికమక ప్రశ్నలు.. చంద్రబాబు చలాకీ సమాధానాలు.. ఈసారి ముచ్చట వేరే లెవెల్!
Unstoppable Season 4: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లోని మరో యాంగిల్ చూపించిన షో .. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ('Unstoppable with NBK). ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే..ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తూ.. తన మాటలతో కట్టిపడేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ టాక్ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల విజయదశమి పర్వదినం సందర్భంగా సీజన్ 4 ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. అయితే.. ఈ 4 వ సీజన్ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్ ఎవరు? అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తును చర్చ జరిగింది. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన 50 ఏండ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ , అవార్డులు అందుకున్నారు. ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతున్నారు బాలయ్య. ఆయన కేవలం సినిమాలో మాత్రమే కాకుండా.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. ఇండియా వైడ్‌గా క్రేజ్ తీసుకొచ్చిన అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు తన డబిడి దిబిడి డైలాగ్స్ తో వచ్చే గెస్టులను రోస్ట్ చేస్తుంటారు. తమ తికమక ప్రశ్నలతో ఇరకాటంతో పడేస్తాడు.

ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఇప్పటివరకూ మూడు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఈ షో ఎంతో పాపులర్ అయింది. ఈ షోతోనే.. ఆహా సబ్‌స్క్రైబర్లు, వ్యూయర్‌షిప్ భారీగా పెరిగిందంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ క్రమంలోనే ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో, రీజినల్ లాంగ్వేజ్ కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది అన్‌స్టాపబుల్. ఇలాంటి సక్సెస్ అందుకున్న ఈ షో కు సంబంధించిన నాలుగో సీజన్ మొదలైంది. ఈ షో దసరా సందర్బంగా స్ట్రీమింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈ షోకు మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandra babu Naidu)విచ్చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నేడు (ఆదివారం) షూటింగ్ జరిగింది. ఈ షోలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొనడం ఇది రెండోసారి. గతంలో అన్‌స్టాపబుల్ సీజన్-2లో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాల్గొన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో అనుభవాలు, తన జీవిత విశేషాలను బాలయ్యతో పంచుకున్నారు నారా చంద్రబాబు. కానీ, ఇప్పుడూ ఏపీ ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తిగా సీజన్-4లో మొదటి గెస్ట్‌గా చంద్రబాబు పాల్గొన్నారు.

మరీ .. ఈ సారి టాక్ షోలో హోస్ట్ బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారనే ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా టీడీపీ రాజకీయ పరిణామాలు, కూటమి విజయం, రాబోయే ఎన్నికల ప్రణాళికలు వంటి రాజకీయ అంశాలపై ప్రశ్నలు అడగబోతున్నారని తెలుస్తోంది. అలాగే.. బాలకృష్ణతో కలిసి నారా చంద్రబాబు పలు టాస్క్‌లు కూడా ఆడునున్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం అటు టీడీపీ కార్యకర్తలు, ఇటు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే.. సీజన్-4 ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాలయ్య అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.తొలి గెస్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో ఈ షోపై మరింత క్యూరియసిటీ పెరిగింది.


Click it and Unblock the Notifications











