Unstoppable 2: బాలకృష్ణతో బాక్సాఫీస్ బ్యూటీ.. ఆమె వచ్చింది అంటే షో మరో రేంజ్ కు వెళ్లినట్లే!

నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా మొదలుపెట్టిన అన్ స్థాపబుల్ షో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారమైన మొదటి సీజన్ భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండవ సీజన్ కోసం కూడా నిర్వాహకులు చర్చలు జరుపుతున్నారు. ఇక గెస్టులు ఎవరు అనే విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ లిస్టులో ఒక స్టార్ హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఆ వివరాలలోకి వెళితే..

కాంట్రవర్సీ విషయాలపై

కాంట్రవర్సీ విషయాలపై

నందమూరి బాలకృష్ణ వెండితెరపై మాత్రమే కాకుండా టాక్ షోలతో కూడా ఆకట్టుకుంటారు అని అన్ స్టాపబుల్ షోతో నిరూపించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇతర స్టార్లతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేస్తూ వారిని గురించి అనేక కాంట్రవర్సీ విషయాలపై కూడా ప్రశ్నలు వేసిన బాలయ్య ఎంతగానో మెప్పించారు. బాలయ్యలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని చాలామంది ఆశ్చర్యపోయారు.

 మొదటి సీజన్ లో..

మొదటి సీజన్ లో..

మొదటి సీజన్ కు అడగగానే చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. రవితేజ నాని విజయ్ దేవరకొండ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇలా చాలామంది స్టార్ హీరోలు బాలయ్య బాబుతో ముచ్చటించిన విధానం వారి అభిమానులకు ఎంతగానో నచ్చింది. అలాగే పూరి జగన్నాథ్ సుకుమార్ అనిల్ రావిపూడి రాజమౌళి వంటి టాలెంటెడ్ దర్శకులు కూడా వచ్చారు.

సెకండ్ సీజన్ కోసం

సెకండ్ సీజన్ కోసం

ఇక సీజన్ 2 లో ప్రత్యేక అతిథులుగా ఎవరెవరు వస్తారు అనే విషయంలో వివిధ రకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈసారి మరి కొంతమంది ప్రముఖ హీరోలను అలాగే స్టార్ హీరోయిన్స్ ను కూడా షోలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం నిర్వాహకులు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం.

మెగా హీరోలు

మెగా హీరోలు

సెకండ్ సీజన్లో మెగా హీరోలలో మరికొంతమంది అన్ స్టాపబుల్ షోలోకి రాబోతున్నట్లు సమాచారం. అందులో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు అని అనేక రకాల కథనాలు వచ్చాయి. అలాగే బాలయ్య బాబుకు సన్నిహితంగా ఉండే మరి కొంతమంది సీనియర్ హీరోలు వెంకటేష్ నాగార్జున కూడా రావచ్చని టాక్ అయితే వినిపిస్తోంది.

అనుష్క వస్తే..

అనుష్క వస్తే..

మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీలు కూడా ఈసారి సెకండ్ సీజన్ లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. అందులో బాక్సాఫీస్ వద్ద సోలో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా రాబోతున్నట్లు టామ్. బయట ప్రపంచంలో పెద్దగా కనిపించని అనుష్క అలాంటి టాక్ షోలోకి వస్తే మాత్రం తప్పకుండా షో మరో లెవల్లో హైలెట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈనెల చివరలోనే షోకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రోమో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X