Unstoppable Season 2: నందమూరి బాలకృష్ణ టాక్ షో పై కిక్కిచ్చే అప్డేట్.. ఫస్ట్ ఎపిసోడ్ డేట్ ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ చేసిన అన్ స్థాపబుల్ టాక్ షో తో ఎంతగా క్రేజ్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె టాక్ షోపై మొదట అంచనాలు పెద్దగా క్రియేట్ అవ్వలేదు. కానీ బాలయ్య విజను కు ఆ తరువాత ప్రతీ ఎపిసోడ్ కు అంతకంతకూ ఆదరణ పెరిగింది. మొదటి సీజన్ చూసిన తర్వాత మళ్లీ రెండవ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే సెకండ్ సీజన్ కు సంబంధించిన ప్రణాళికను మొత్తం పూర్తయినట్లుగా తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో టాక్ షోకు సంబంధించిన షూట్ కూడా మొదలు కాబోతోంది. ఈ క్రమంలో ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఒక టాక్ వైరల్ గా మారుతొంది. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పటి నుంచి మరింత క్రేజ్
నందమూరి బాలకృష్ణ వెండితెరపై తప్పితే గతంలో ఇతర అంశాలతో పెద్దగా హైలెట్ అయ్యింది లేదు. ఇక ఎప్పుడైతే బాలయ్య అన్ స్టాపబూల్ షో మొదలయ్యిందో అప్పటి నుంచి కూడా బాలయ్య క్రేజ్ మరింత విభిన్నంగా పెరిగిపోయింది. జై బాలయ్య నినాదం కూడా ఆయన కనిపించిన ప్రతీసారి కూడా మారుమ్రోగింది.

భారీ స్థాయిలో క్రేజ్
అన్ స్టాపబుల్ షో అనంతరం ఆయన ఎక్కువగా వివాదంలో ఉన్న అంశాలపై కూడా చాలా తెలివిగా స్పంధించేవారు. ఇక బాలయ్యలో ఉన్న మరో మంచి కోణం, సరదా గుణం కూడా ఆడియెన్స్ కు ఆయనను మరింత దగ్గర చేశాయి. బాలయ్య అన్ స్టాపబుల్ షో ఓటీటీ ప్రపంచంలోనే అప్పట్లో అత్యధిక వ్యూవ్స్ కూడా అందుకుంది.

క్లారిటి ఇచ్చేశారు
ఇక సెకండ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలోనే బాలయ్య కూడా సెకండ్ సీజన్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆహా ఇండియన్ ఐడల్ సూపర్ సింగర్ లో కూడా త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 రానున్నట్లు చెబుతూ అలాంటి ఆహ్లాదకరమైన షోకు ముగింపు ఉండదని ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చారు.

సెకండ్ సీజన్ స్టార్స్
ఇక సెకండ్ సీజన్ కు సంబంధించిన పనులను గత నెలలోనే స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలయ్య బాబు ఈసారి మరీంత బిగ్ స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ అలాగే మరికొందరు యువ హీరోలు సీనియర్ దర్శకులు తెనిషియన్స్ కూడా ఉంటారని టాక్ వస్తోంది.

డేట్ ఫిక్స్?
ఇక అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మొదటి ఎపిసోడ్ ఆగస్టు మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందట. మొదటి గెస్ట్ పై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన నిర్వాహకులు త్వరలోనే అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా దసరా లేదా ఆ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











