బాలయ్య ఫ్యాన్సా మజాకా.. ఆ రోజు సెలవు కావాలంటూ డిమాండ్..
Unstoppable with NBK Season 4: నట సింహం నందమూరి బాలకృష్ణ.. అది పేరు కాదు.. ఓ బ్రాండ్. ఆ పేరు వెంటేనే.. నందమూరి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బాలకృష్ణలోని మరోకోణాన్ని చూపించిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'(Unstoppable with NBK). ఇప్పటివరకూ ఈ టాక్ షో.. మూడు సీజన్లను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్‌లో అడుగుపెడుతోంది. అయితే.. ఈ సీజన్ తొలి గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఈ తొలి ఎపిసోడ్ అక్టోబర్ 25న (శుక్రవారం) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్, ఐటీ ఉద్యోగుల నుంచి ఓ క్రేజీ డిమాండ్ వెలుగులోకి వచ్చింది.
నందమూరి తారక రామరావు నటవారసుడిగా బాలకృష్ణ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించి.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణలోని మరో కోణాన్ని వెలుగులోకి తీసుకవచ్చిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK). ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే .. ఈ టాక్ షో కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఈ టాక్ షోలో తనదైన ఛలోక్తులు, పంచ్‌లు, ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతో టాక్ షోని సక్సెస్ చేశారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఇప్పటివరకూ మూడు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ఎంతో పాపులర్ అయింది. ఈ షోతోనే.. ఆహా సబ్‌స్క్రైబర్లు, వ్యూయర్‌షిప్ భారీగా పెరిగిందంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ క్రమంలోనే ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో, రీజినల్ లాంగ్వేజ్ కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది అన్‌స్టాపబుల్. ఈ సక్సెస్ పుల్ టాక్ షో నాలుగో సీజన్ దసరా పర్వదినం రోజున లాంచ్ అయిన విషయం తెలిసిందే.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4 వ సీజన్ కు తొలి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandra babu Naidu)పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత, రాజకీయ జీవిత విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, జనసేనాని పవన్‌తో భేటీ, ఇద్దరి మధ్య చర్చలు, రాజమండ్రి జైలులో ఉన్న 53 రోజులు ఎలా గడిచాయి వంటి విషయాలతోపాటు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు.

అలాగే.. చంద్రబాబుకు బాలయ్య ఫన్నీ టాస్కులు కూడా ఇచ్చినట్లు చూపించారు. ఈ సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ షోలో బావ బామర్దులు సరదాగా, చమత్కారంగానూ మాట్లాడారు. చంద్రబాబు గెస్ట్ గా పాల్గొన్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమో నిమిషాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షలాది వ్యూస్ సంపాదించుకుంది. తొలి గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనడంతో ఈ ఎపిసోడ్ పై క్యూరియసిటీ పెరిగింది. ఎప్పుడెప్పుడు ప్రసారం కాబోతుందని వేచి చూసున్నారు. తొలి ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ ఆహాలో అక్టోబర్ 25 (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4 వ సీజన్ (Unstoppable with NBK Season 4) తొలి ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్, ఐటీ ఉద్యోగుల నుంచి ఓ క్రేజీ డిమాండ్ వెలుగులోకి వచ్చింది. ఈ సీజన్ లో తొలి గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కావడంతో అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని, అక్టోబర్ 25వ తేదీన అన్‌స్టాపబుల్ - 4 ఎపిసోడ్ 1 స్ట్రీమింగ్ రోజు సెలవు కోరుతూ ప్రదర్శనలు నిర్వహించడం చూస్తే ఐటీ ఉద్యోగుల్లో చంద్రబాబు క్రేజ్ కు నిదర్శనంగా కనిసిస్తుంది. ఉద్యోగుల ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య ఫ్యాన్సా మజాకా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











