Unstoppable with NBK: రాజమండ్రి జైలులో ఏం జరిగింది? పవన్ ఏం చెప్పాడంటే? బాలయ్యతో చంద్రబాబు ఎమోషనల్
Unstoppable Season 4: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ('Unstoppable with NBK). హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ టాక్ షోలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూ.. తన తికమక ప్రశ్నలతో కట్టిపడేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ టాక్ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగో సీజన్‌లో ప్రారంభమైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు గెస్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandra babu Naidu)విచ్చేశారు. ఈ టాక్ షోలో సంచలన విషయాలను వెల్లడించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో తాజాగా తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుత తెగ వైరల్ అవుతోంది.
తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో.. 'దేశ రాజకీయ చరిత్రలో ఎవరు ఊహించని విజయాన్ని అందుకున్న చాణిక్యుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు. మా బావగారు.. మీ బాబు గారు..' అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు గ్రాండ్ గా వెల్కం చెప్పారు నందమూరి బాలకృష్ణ.

ఇక షోలో ప్రారంభంలో.. 'చంద్రబాబు నాయుడు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో.. ఏది అడిగిన దానికి సమయస్ఫూర్తిగా సమాధానం చెప్తానని ప్రమాణం చేశాయించారు. అయితే నవ్వుతూ అంటే.. బాబు గారు మాత్రం సమయస్ఫూర్తితో సమాధానం చెప్తానంటూ బాలయ్యకు పంచ్ వేశాడు. ఆపై బాలయ్యపై తలపై ప్రమాణం చేయబోతాడు. దీంతో బాలయ్య నా మీద మాత్రం
నాపై వద్దు బావా అంటాడు.
బాలయ్య తన ప్రశ్నలో ఎన్ కౌంటర్ లో భాగంగా.. తొలుత చంద్రబాబు అరెస్టు గురించి ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు గురించి చెబుతూ.. 'ఆ సమయంలో నేను బస్సు లో ఉన్నాను. మిమ్మల్ని అరెస్టు చేయబోతున్నాం' అని చెప్పారు. రాత్రంతా తలుపు కొడితున్నారు. అయినా తలుపు కూడా తీయలేదు' అని చెప్పారు.

ఆ తర్వాత జైల్లో మొదటి రాత్రి ఎలా గడిచింది బావ అని ప్రశ్నించగా.. చంద్రబాబు సమాధానం చెప్తూ ఉద్వేగానికి గురయ్యారు. 'తన జీవితంలో మొదటిసారి చావు గురించి ఆలోచన వచ్చిందని, జైల్లో ఉన్న 53 రోజులు కూడా అలానే ఉంది' అని ఎమోషనల్ అయ్యారు. కానీ నేను మాత్రం తప్పు చేసిన వారిని అస్సలు విడిచిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.
ఆకాశంలో ఆ సూర్యచంద్రులు.. ఆంధ్రాలో బాబు- కళ్యాణ్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రశ్నించారు. తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన మీటింగ్ అది. ఇంతకీ ఆ జైలు గోడల మధ్య పవన్ కళ్యాణ్- చంద్రబాబులకు మధ్య ఏం జరిగింది? అనేది ప్రజలకు తెలియాలంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు సమాధానం చెప్పుతూ.. 'రెండు నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ నేను మాట్లాడాను. ఆ సమయంలో ఓ నూతన చరిత్ర రాయడానికి సమయస్పూర్తిగా తీసుకున్న నిర్ణయం' అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాము థింక్ గ్లోబలీ.. యాక్ట్ గ్లోబలీ అనే స్టోగన్ తో ముందుకు వెళ్తున్నామని. ప్రపంచంతో తెలుగు జాతి గౌరవపడి జీవించేలా చేస్తామన్నారు చంద్రబాబు. ఈ టాక్ షోలో చంద్రబాబు అరెస్టు నుంచి తాజా రాజకీయాల వరకూ పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. చంద్రబాబు తన జైలు జీవితంలోని అనుభవించిన చేదు జ్ఞాపకాలను పంచుకుంటూ ఎమోషన్ అయ్యారు. మొత్తానికి బాలయ్య టాక్ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నట్టు .. ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











