స్క్రీన్‌పై నాగార్జున ఫోటో .. వెంకటేష్‌తో బాలయ్య షాకింగ్ కామెంట్స్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్ధ ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 3 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది విజయదశమి పర్వదినం సందర్భంగా సీజన్ 4 ప్రారంభమైంది. నాటి నుంచి పలువురు సెలబ్రెటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నారు.

ఆహాను రేసులో నిలబెట్టి.. ఇండియా వైడ్‌గా క్రేజ్ తీసుకొచ్చిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఈ ఒక్క కార్యక్రమంతో ఆహా సబ్‌స్క్రైబర్లు, వ్యూయర్‌షిప్ భారీగా పెరిగింది. నటసింహం నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలన్న అల్లు అరవింద్ ప్లాన్ సూపర్‌ సక్సెస్ అయ్యింది. తన టైమింగ్, ఆట పాటలతో అన్‌స్టాపబుల్‌ను బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టారు బాలయ్య.

unstoppable with nbk season 4 Venkatesh episode promo

అన్‌స్టాపబుల్ సీజన్ 4లో ఇప్పటి వరకు ఆరు ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ కాగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్, సూర్య, బాబీ డియోల్, అల్లు అర్జున్, శ్రీలీల, నవీన్ పోలిశెట్టి హాజరయ్యారు. 7వ ఎపిసోడ్‌కు టాలీవుడ్ అగ్ర కథనాయకుడు విక్టరీ వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబులు గెస్ట్‌లుగా వచ్చారు. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. తాజాగా 7వ ఎపిసోడ్‌ ప్రోమోను ఆహా విడుదల చేసింది.

ప్రోమో ప్రారంభం కాగానే.. మనం ఒకరికొకరం పోటీనా అని బాలయ్య ప్రశ్నించగా.. ఎక్కడమ్మా పోటీ అని వెంకటేష్‌ ఆన్సర్ ఇస్తారు. డాకు మహారాజ్ అని వెంకీ గుర్తు చేయగా.. నువ్వే నా మనసులో మహరాజ్ అంటారు బాలయ్య. ఆ తర్వాత ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. అలాగే చిరు, నాగార్జునలతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను స్క్రీన్‌పై వేసి ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు అని బాలయ్య చొప్పుకొచ్చాడు. వీరిలో రాముడు మంచి బాలుడు ఎవరని బాలయ్య అడగ్గా.. కొంపతీసి నువ్వు రాముడివా అని వెంకటేష్ ఆటపట్టించారు.

ఇందులోనే నాగచైతన్యతో బాండింగ్ గురించి చెబుతూ వెంకీ ఎమోషనల్ అయ్యారు. అలాగే తన కూతుళ్ల గురించి పరిచయం చేశాడు. ఆ వెంటనే వెంకటేష్ సోదరుడు, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబును .. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడిలను ఆహ్వానించారు బాలయ్య. ఈ సందర్భంగా తన తండ్రి రామానాయుడు గురించి చెప్పి సురేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. చెన్నైలో ఉన్నప్పుడు వెంకీ రైల్వే ట్రాక్‌లపై చేసిన అల్లరిని వీరు ముగ్గురు గుర్తుచేసుకున్నారు. చివరిలో అనిల్ రావిపూడితో కలిసి వెంకీ , బాలయ్య డ్యాన్స్ చేసి హోరెత్తించారు. మరి వీరి అల్లరి చూడాలంటే డిసెంబర్ 27 రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X