OTTలోకి 12 క్రేజీ టాలీవుడ్ చిత్రాలు... ఇది కదా అసలైన పండగంటే!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 2024 సంవత్సరానికి గానూ టాలీవుడ్ ప్రేక్షకుల కోసం 12 క్రేజీ చిత్రాలను ఓటీటీలోకి తీసుకురాబోతుంది. ఇందులో పెద్ద పెద్ద చిత్రాలతో పాటు... చిన్న చిన్న చిత్రాలు సైతం ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈ జాబితాను నెట్ ఫ్లిక్స్ పండగ పేరిటి తాజాగా రిలీజ్ చేసింది. ఆ 12 క్రేజీ చిత్రాలంటో ఓసారి లుక్కేద్దాం.

కరోనా తర్వాత ఓటీటీ సంస్థలకు బాగా డిమాండ్ వచ్చేసింది. చాలా మందికి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ఓపిక ఉండదు. ఇక ఓటీటీల్లో రిలీజ్ అయ్యాక.. చూద్దాంలే అనుకుంటూ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఇక ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా టాప్ ఓటీటీగా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్.. తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరమైన ప్రకటన చేసింది.

Upcoming Netflix Telugu Movies List 2024: Salaar, Devara, Pushpa 2, Balayya 109, VD 12 Full Details Here

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో త్వరలో 12 టాలీవుడ్ క్రేజీ సినిమాలు రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పెద్ద జాబితాను తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్ట్ చేసింది. ఒక్కొక్క సినిమా గురించి వివరిస్తూ ఒక్కొక్క పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా అందులో ఆర్షిస్తున్న చిత్రాలు మూడు ఉన్నాయి. ఒకటి దేవర కాగా... ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఇక ఆ తర్వాత పుష్ప 2 కూడా ఆసక్తి కలిగిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న రిలిజ్ కానుంది ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ప్రటించింది.

ఇక ఈ సినిమాతో పాటు.. ప్రభాస్ నటించిన సలార్ కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు.. బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 109 చిత్రం, సిద్దు జోన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయని వెల్లడించింది.

ఇవే కాకుండా విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ 37వ సినిమాగా తెరకెక్కుతున్న సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ సినిమా, అల్లు శిరీష్ టెడ్డీ, యువీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రాలు నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X