OTT movies: ఈ వారం రాబోయే ఓటీటీ సినిమాలు.. అందరి ఫోకస్ ఆ సినిమాపైనే!
ప్రతివారం కూడా ఓటీటీ ప్రపంచంలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో కూడా సినిమాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. కొన్ని సినిమాలకు అయితే నెలల తరబడి మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. హాట్ స్టార్ తో పాటు అమెజాన్ ప్రైమ్ కూడా మరింత పోటీని ఇచ్చే విధంగా భిన్నమైన వెబ్ సిరీస్ కంటెంట్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక అక్టోబర్ 25 నుంచి వివిధ ఓటీడీ ప్లాట్ఫామ్స్ లో విభిన్నమైన సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. ఇక వీటన్నిటిలో ఎక్కువగా సౌత్ఆడియన్స్ ఫోకస్ అయితే ఒక సినిమాపై పడింది.ఆ సినిమా మరేదో కాదు. ధనుష్ నటించిన నేనే వస్తున్నా అనే సినిమా. 7/g బృందావన కాలనీ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే యుగానికి ఒక్కడు అని డిఫరెంట్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన టాలెక్టెడ్ దర్శకుడు సెల్వ రాఘవ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
అయితే ఇప్పుడు ఓటీటీ లో ఈ సినిమాను చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ అక్టోబర్ 27వ తేదీన తెలుగు తమిళంలో ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక అక్టోబర్ 28వ తేదీన ఫ్లిమ్స్ అనే ఒక హిందీ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.

హాట్ స్టార్ లో కూడా ఈ వారం మూడు విభిన్నమైన సినిమాలు సీరీస్ లు రాబోతున్నాయి. అక్టోబర్ 26 టేల్స్ ఆఫ్ ది జేడీ(సిరీస్), అక్టోబర్ 27 ఝాన్సీ(తెలుగు సిరీస్)
అక్టోబర్ 28 అప్పన్(మలయాళం) అనే సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే 25వ తేదీ నుంచి 28 వ తేదీ మధ్యలో 9 డిఫరెంట్ సినిమాలు సీరీస్ లు రానున్నాయి. అక్టోబర్ 25 - బ్లేడ్ ఆఫ్ ది 47 రోనిన్(స్ట్రీమింగ్), క్యాబినేట్ ఆఫ్ క్యూరియాసిటీ(ఇంగ్లీష్ సిరీస్), రాబింగ్ ముస్సోలిని (ఇటాలియన్).
స్కా అక్టోబర్ 26 - ది గుడ్ నర్స్ అనే ఇంగ్లీష్ సినిమా వస్తుండగా అక్టోబర్ 27న దుబాయ్ బ్లింగ్(రియాలిటీ షో), బియాండ్ ది యూనివర్స్(ఇంగ్లీష్) సినిమాలు రానున్నాయి. ఇక అక్టోబర్ 28న మర్డర్ ఇన్ ది కోర్ట్ రూమ్(ఇంగ్లీష్ సిరీస్), ఆల్ క్వైట్ ఇన్ ది వెస్ట్రన్ ఫ్రంట్(ఇంగ్లీష్), అక్టోబర్ 2న ది బాస్టర్డ్ ఆన్ అండ్ ది డెవిల్ హిమ్ సెల్ఫ్(సిరీస్) లు రానున్నాయి.


Click it and Unblock the Notifications











