Kabzaa OTTకి భారీ ధర.. KGFలా ఉందన్న తగ్గని క్రేజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందారు ఉపేంద్ర. ఆయన సినిమాలతో హీరోల క్యారెక్టరైజేషన్ లో కొత్త ఒరవడి సృష్టించారు. విచిత్రపు వేషధారణతో నెగెటివ్ లక్షణాలతో సరికొత్తగా హీరో పాత్రను ఆయన సినిమాల్లో పోషించారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఉపేంద్ర తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తిలో నెగెటివ్ రోల్ తో ఆకట్టుకున్నారు.
ఇటీవలే కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. అయితే ఈ మూవీ ఓటీటీ విడుదలపై ఎన్నో రూమర్స్ వినిపించినా.. ఫైనల్ గా ఎందులో, ఏ రోజు నుంచి స్ట్రీమింట్ అనే విషయాలను సదరు డిజిటల్ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది.

విలక్షణ నటుడిగా పేరొందిన ఉపేంద్ర తాజాగా కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాకా తెరకెక్కిన ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కగా ఇందులో సీనియర్ గ్లామరస్ డాల్ శ్రీయ సరన్ హీరోయిన్ గా అలరించింది.
కేజీఎఫ్ తరహాలో ఉందని విమర్శలు వచ్చిన కబ్జా సినిమాలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస్, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఏడు భారతీయ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 17న విడుదలైంది. మూవీ విడుదలైన రోజు నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోందని మేకర్స్ ప్రకటించారు. అయితే అవన్నీ దొంగ లెక్కలు అని.. వచ్చినదానికి పదింతలు కలిపి చెబుతున్నారని నెట్టింట్లో ట్రోలింగ్ కూడా జరిగింది.
అయితే కబ్జా సినిమాను థియేటర్లలో చూసేందుకు ఇష్టపడని ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి వచ్చే తేదిని తాజాగా ప్రకటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఆ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
మిక్స్ డ్ టాక్, విమర్శలు తలెత్తిన ఉపేంద్ర కబ్జా సినిమాను రూ. 154 కోట్లు ఖర్చు చేసి మరి అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందట. దీంతో ఈ టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 14 నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉండనుంది.


Click it and Unblock the Notifications











