Kabzaa OTT: కబ్జా డిజిటల్ రైట్స్ కు భారీ ధర.. సొంతం చేసుకున్న ఆ ఓటీటీ.. రిలీజ్ ఎప్పుడంటే!

కన్నడ విలక్షణ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించిన ఉపేంద్ర, A, ఓం పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన సినిమాలతో హీరోకు కొత్త అర్థం తీసుకొచ్చారు. ఇలా తమిళం తెలుగు చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్న ఉపేంద్ర తాజాగా కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కేజీఎఫ్ కు డబ్బింగ్ వెర్షన్ అంటూ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది ఈ మూవీ. అయితే తాజాగా కబ్జా సినిమా ఓటీటీ విడుదల తేది ఆసక్తికర అంశంగా మారింది.

నెగెటివ్ రోల్ తో..

నెగెటివ్ రోల్ తో..

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందారు ఉపేంద్ర. ఆయన సినిమాలతో హీరోల క్యారెక్టరైజేషన్ లో కొత్త ఒరవడి సృష్టించారు. విచిత్రపు వేషధారణతో నెగెటివ్ లక్షణాలతో సరికొత్తగా హీరో పాత్రను ఆయన సినిమాల్లో పోషించారు. ఇటీవల సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఉపేంద్ర త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ రోల్ తో ఆకట్టుకున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు.

 భారీ బడ్జెట్ చిత్రంగా..

భారీ బడ్జెట్ చిత్రంగా..

విలక్షణ నటుడిగా పేరొందిన ఉపేంద్ర తాజాగా కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాకా తెరకెక్కిన ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కగా ఇందులో సీనియర్ స్టన్నింగ్ బ్యూటి శ్రీయ సరన్ హీరోయిన్ గా చేసింది.

అలా ఉందని విమర్శలు..

అలా ఉందని విమర్శలు..

136 నిమిషాలు ఉన్న కబ్జా సినిమాలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకున్న కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఏడు భారతీయ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 17న విడుదలైంది. ఈ సినిమా సేమ్ కేజీఎఫ్ లా ఉందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ సినిమాకు క్లేజ్ మాత్రం తగ్గలేదు. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది.

ఏకంగా అన్ని కోట్లకు..

ఏకంగా అన్ని కోట్లకు..

ఈ క్రమంలో ఉపేంద్ర, శ్రీయ సరన్ జోడి కట్టిన కబ్జా సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా రూ. 154 కోట్లకు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కబ్జా సినిమాను ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ చేస్తారని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం.

 కేజీఎఫ్ ప్రభావం..

కేజీఎఫ్ ప్రభావం..

1942 నుంచి 1986 మధ్య కాలంలో ఉన్న ఓ గ్యాంగ్ స్టర్ స్టోరీగా కబ్జా సినిమాను తెరకెక్కించారు. ఓ చిన్న గ్యాంగ్ స్టర్ పెద్ద డాన్ గా ఎలా ఎదిగాడన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. అయితే ఈ స్టోరీ విన్నా, ట్రైలర్ చూసిన కేజీఎఫ్ సినిమానే గుర్తుకు వస్తుందని అనేక మంది తెలిపాపు. కేజీఎఫ్ సినిమా రెండు బాగాలు విడుదలై సూపర్ డూపర్ హిట్ కావడంతో వాటి ప్రభావం ఈ సినిమాపై పడిందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు ట్విటర్ లో పాజిటివ్, నెగెటివ్ రివ్యూలు రెండు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X