Uppu Kappu Rambu: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
గ్లామరస్ పాత్రలతో, ఐరన్‌లెగ్‌గా ముద్ర వేయించుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మహానటి సినిమాతో తనలోని నటిని బయటకు తీసుకొచ్చారు. ఏకంగా జాతీయ అవార్డ్‌తో సత్తా చాటారు. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా అవతరించిన కీర్తి కథలు, సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. కథాబలం లేని సినిమాలను తిరస్కరిస్తూ వచ్చారు. ఓటీటీలు ప్రస్తుతం దున్నేస్తుండటంతో ఇటువైపు ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా ఆమె నటించిన చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాల్లోకి వెళితే..
మహానటితో ఆచితూచి సినిమాలు
మహానటి తర్వాత వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేశారు కీర్తి సురేష్. కానీ అవి అంతగా వర్కవుట్ కాకపోవడంతో తిరిగి కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేశారు. సర్కార్ వారి పాట చిత్రంలో మహేశ్‌తో కలిసి రెచ్చిపోయింది. ఇదే సమయంలో బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి చేతులు కాల్చుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు దగ్గరవుతున్న సమయంలోనే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి షాకిచ్చింది. తన చిన్న నాటి మిత్రుడు ఆంటోనీ తట్టితో ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పిన కీర్తి సురేష్.. గతేడాది గోవాలో హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో అతనిని పెళ్లాడింది. ప్రస్తుతం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, కన్నివెడి సినిమాలలో నటిస్తున్నారు.

కీర్తి సురేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సుహాస్
బేబీ జాన్ తర్వాత కీర్తి నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కీర్తి సురేష్‌తో విభిన్న సినిమాలు తీస్తూ యువతలో క్రేజ్ సంపాదించుకున్న సుహాస్ స్క్రీన్ చేయడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. ఈ చిత్రానికి ఐవీ శశి దర్శకత్వం వహించగా.. బాబూ మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి కీలకపాత్రలు పోషించారు. వసంత మారింగంటి రచనా సహకారం అందించారు. 1990వ దశకంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
గ్రామీణ వాతావరణంలో సినిమా
దక్షిణ భారతదేశంలోని ఓ సముద్ర తీర ప్రాంతంలోని చిట్టి జయపురం అనే ఓ గ్రామంలో అంత్యక్రియల విధానంపై సెటైరికల్‌గా ఈ ఉప్పుకప్పురంబు మూవీని చిత్రీకరించారు. ఇది గ్రామంలో ఓ పెద్దగా సమస్యగా మారడంతో గ్రామస్తులు దీనిని ఎలా పరిష్కరించారు అన్నదే ఉప్పుకప్పురంబు. కీర్తి సురేష్, సుహాస్‌తో పాటు మిగిలిన నటీనటులు అద్భుతంగా నటించారని చెబుతున్నారు. ఈ సినిమాను తొలుత థియేటర్‌లలో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ నేరుగా ఓటీటీలోకే తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు.
200కు పైగా దేశాలలో స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సినిమా జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో ఉప్పుకప్పురంబు సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. భారత్‌తో దాదాపు 200కు పైగా దేశాలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ నిఖిల్ మధోక్ వెల్లడించారు. మన వెండితెరపై ఇప్పటి వరకు రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉప్పుకప్పురంబు చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











