Urvasivo Rakshasivo OTT: ఆ ఓటీటీలో రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు వస్తుందంటే!
ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు. అయితే, అందులో కొందరు మాత్రం సుదీర్ఘ ప్రయాణం చేసినా సరైన హట్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో సినిమాలు చేసినా భారీ హిట్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'ఊర్వశివో రాక్షసివో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా రాకేష్ శశి తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే 'ఊర్వశివో రాక్షసివో'. విడుదలకు ముందే మంచి బజ్‌ను ఏర్పరచుకున్న ఈ చిత్రం.. నవంబర్ 4వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా 'ఊర్వశివో రాక్షసివో' చిత్రానికి ఆశించిన వసూళ్లు దక్కలేదు. దీంతో ఇది బాక్సాఫీస్ ముందు ఏబో ఏవరేజ్‌గానే నిలిచిపోయింది.

ఇక, థియేటర్లలో ఆశించిన రీతిలో సందడి చేయలేకపోయిన 'ఊర్వశివో రాక్షసివో' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు శిరీష్ నటించిన ఈ మూవీని విడుదలైన నాలుగు వారాల తర్వాత అంటే డిసెంబర్ 9వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను సదరు సంస్థ అధికారికంగా వదిలింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా ఆహాలో దీన్ని చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
అల్లు శిరీష్ నటించిన తాజా సినిమానే 'ఊర్వశివో రాక్షసివో'. రాకేష్ శశి తెరకెక్కించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ధీరజ్, విజయ్ నిర్మించారు. ఈ మూవీకి అచ్చు, అనూప్ సంగీతాన్ని అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, సునీల్, పోసాని, ఆమని కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











