Telugu Indian idol: సింగర్ శ్రీరామ్ నిర్వాకం.. ప్రముఖ గాయని ఉషా ఉతప్ మనస్తాపం.. కాళ్ల మీద పడినా..

పూర్తి స్థాయి తెలుగు ఓటీటీగా రంగంలోకి దిగిన ఆహా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. దీంతో కేవలం సినిమాలు అనే కాకుండా ఒరిజినల్ షోస్ కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి ఇప్పుడిప్పుడే ఒక మంచి పేరు అనేది వస్తోంది. ఐతే ఈ షోలో అనుకోని ఒక సంఘటన అందరికీ షాక్ కలిగించింది. ఈ షోకి జడ్జ్ గా విచ్చేసిన ఉషా ఉతుప్‌ కోపంతో ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. అయితే అసలు ఏమైంది? అంతటి లెజండరీ సింగర్ ఎందుకలా చేయాల్సి వచ్చింది? అనే వివరాలోకి వెళితే..

ఆసక్తికర ఘటన

ఆసక్తికర ఘటన


తెలుగు ఇండియన్ ఐడల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటిగా నిలిచింది. ఆహా వీడియో ఒటీటీ యాప్ లో ఈ రియాల్టీ షో ప్రసారం అవుతోంది. రియాలిటీ షోలో ప్రస్తుతం 6 మంది పోటీదారులు ఉన్నారు. వీరంతా ఇండియన్ ఐడల్ ౧ టైటిల్‌ను గెలుచుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు. ఉషా ఉతప్ ప్రస్తుత ఎపిసోడ్‌లకు ప్రత్యేక అతిథిగా ఇండియన్ ఐడల్‌కి వచ్చారు. ఇక తాజాగా ప్రసారమైన 29వ ఎపిసోడ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

 గంభీరం

గంభీరం


హోస్ట్ శ్రీరామ చంద్రకు కవిత్వం చెప్పడం అలవాటు ఉంది, ఈ ఎపిసోడ్ లో కూడా ఆయన ఉషా ఉతుప్‌పై ఒక కవిత వినిపించారు. శ్రీరామ్ "ఉషా ఉతుప్‌ గారు ..మీ వాయిస్ గంభీరం .. మీ పాట అమృతం .. మీరు మైక్ లేకుండా పాడితే కీచురాళ్ళు.. అది వినిపిస్తుంది కొన్ని మైళ్ళు.. మీ నుదిటిన పెద్ద బొట్టు .. ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు ఒట్టు " అంటూ ఆమె మీద ఒక కవితను సంధించారు.

సీట్ నుంచి లేచి

సీట్ నుంచి లేచి


అది విన్న తరువాత 'నా మీద నేను జోక్స్ వేసుకుని నవ్వుకుంటాను. కానీ నువ్వు ఈరోజు నన్ను గంభీరం అని సంబోధించావ్. ఇలా అనడం నాకు నచ్చలేదు. ఈ షో కోసం నేను కోల్కతా నుంచి వచ్చాను, ఇన్ని వేల మంది చూస్తున్న ఈ షోలో నన్ను ఇలా అవమానించడం ఏం బాలేదు' అంటూ శ్రీ రామచంద్ర మీద ఫైర్ అయ్యి సీట్ నుంచి లేచి వెళ్లిపోతుంది ఉషా ఉతుప్. ఈ దెబ్బకు షోలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీరామ చంద్రకు కూడా అసలేం జరుగుతుందో అర్ధం కాక ఉషాఉతుప్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు.

కాళ్ళ మీద పడినా

కాళ్ళ మీద పడినా


అయితే ఆయన వెళ్లి కాళ్ళ మీద పడినా ఆమె క్షమించక పోయేసరికి అదే పనిగా సారీ చెప్తూనే ఉన్నాడు. అసలు నువ్వు మధురం అని కాకుండా గంభీరం అంటూ ఒక మగవాడిగా నన్ను అభివర్ణించావు అని ఆమె మండిపడ్డారు. ఏదైమైనా జోక్స్ అంటే నాకు ఇష్టం కానీ ఇది టూ మచ్ అని కోప్పడ్డారు. అమ్మా, క్షమాపణలు. నేను కావాలని అలా చెప్పలేదు మీ ఆశీర్వాదం కావాలి అంటూ ఎంతో ప్రాధేయపడ్డాడు శ్రీరామ్. చివరికి టీమ్ అందరూ నచ్చచెప్పాక ఆమె కొంచెం శాంతించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇదంతా లైట్

ఇదంతా లైట్


ఇంత చేసిన తర్వాత చివరికి ఉష కూడా నవ్వేసి 'నేను అలాంటి దాన్నా కాదా, అనేది ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. నా మీద నేనే జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటాను. ఇదంతా లైట్' అనేసరికి శ్రీరామ్ కు ప్రాణం లేచొచ్చినట్టైంది. ఆ వెంటనే తమన్ స్టేజిని కూల్ చేయడానికి " ఉషా ఉతుప్ కాదు ఉషా షట్ అప్" అని అనేసరికి అందరూ నవ్వేశారు. అలా శ్రీ రామ్ మీద ప్రాంక్ చేసి ఆమె షాక్ ఇచ్చింది. ఇంత గ్రేట్ ప్రాంక్ చేసి నా దిమ్మ తిరిగేలా చేశారు అంటూ శ్రీరామ్ అనేసరికి ఉషా కూడా సరదాగా న‌వ్వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X