Ustaad Bhagat Singh OTT Deal: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్' రికార్డు.. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?
Ustaad Bhagat Singh OTT Deal: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). గతంలో 'గబ్బర్ సింగ్'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ కాంబో మళ్లీ కలవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కుల కోసం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ( Netflix) భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఉస్తాద్ ఓటీటీ డీల్స్ ఎన్ని కోట్లంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్‌బీ శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. స్క్రీన్‌ప్లేను కె. దశరథ్, రమేష్ రెడ్డి సమకూర్చగా, రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ పని చేశారు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండగా, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలకు నేటికి సరిగ్గా నెల రోజు.. మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మార్చి రెండో వారంలో ట్రైలర్ రానుంది. ఇంకా రెండు పాటలు విడుదల కావాల్సి ఉన్నాయి.
ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంత?
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీ మొత్తంలో జరిగినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో హాంబెల్స్ ఫిల్స్ విడుదల చేయనుందని సమాచారం. ఓవర్సీస్ డీల్ కూడా త్వరలో క్లోజ్ కానుందని టాక్. ఈ నేపథ్యంలో థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి ఈ సినిమా దాదాపు రూ.140 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశముందని అంచనా. ఆంధ్ర థియేట్రికల్ హక్కులకే రూ.70 కోట్ల వరకు డిమాండ్ ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ క్రేజ్, హరీష్ శంకర్ మాస్ మేకింగ్‌పై ఉన్న హైప్స్ కు ఇది నిదర్శమని చెప్పవచ్చు.
నెట్‌ఫ్లిక్స్‌తో భారీ డీల్
ఇక ఓటీటీ డీల్ కూడా భారీ మొత్తం జరిగినట్టు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, ఇదే నిజమైతే ఇది టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్స్‌గా నిలవనుంది. గతంలో పవన్ నటించిన OG సినిమాకు కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటు చెల్లించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందింది. అదే ట్రాక్ రికార్డ్ కారణంగా 'ఉస్తాద్' కూడా భారీ డీల్ ఫిక్స్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











