Ustaad Bhagat Singh OTT: ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఇప్పుడు ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు OTT రిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. పవన్ మూవీ ఎప్పుడు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది పరిశీలిస్తే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా, విలన్‌గా ఆర్. పార్థిబన్ కనిపించారు. అలాగే కే.ఎస్. రవికుమార్, గౌతమి, రావు రమేష్, ప్రభాస్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్. థమన్ అందించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించగా, దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ స్టార్ పవర్, దర్శకుడు హరీష్ శంకర్ టేకింగ్‌పై ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్, ఓవర్సీస్ మార్కెట్లలో కలిపి సుమారు రూ. 137 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమాకు దాదాపు రూ. 140 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫిక్స్ చేశారు. అయితే రిలీజ్ అయిన తొలి షో నుంచే సినిమాకు మిశ్రమ స్పందన రావడం గమనార్హం. కొంతమంది ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైల్ రీటర్న్ అని ప్రశంసిస్తే, మరికొందరు కథ, స్క్రీన్‌ప్లే పాత స్టైల్‌లోనే ఉందని విమర్శించారు.
మాస్ ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇతర సినిమాలతో పోటీ ఉండటం కలెక్షన్లపై ప్రభావం చూపింది.ముఖ్యంగా ధురంధర్ 2 ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. ట్రేడ్ పోర్టల్ 'సక్నిల్క్' (Sacnilk) గణాంకాల ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 96.55 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూ. 72.15 కోట్లకు చేరగా, ఇండియా గ్రాస్ రూ.84.7 కోట్లుగా నమోదైంది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 11.85 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ (Netflix)భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. సుమారు రూ.80 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులు విక్రయించబడినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన తర్వాత ఐదు వారాల గ్యాప్‌తో OTTలో విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేసినప్పటికీ, షెడ్యూల్ మార్పుల కారణంగా ముందుగానే స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. దీంతో ఈ సినిమా ఏప్రిల్ 16, 2026 నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను చేరుకోవాలని ప్లాన్ చేశారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, ఇప్పుడు OTTలో ఈ సినిమాను వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఉస్తాద్ భగత్ సింగ్ , ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఏప్రిల్ 16 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications



















