Ustaad Bhagat Singh OTT: ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ కాంబినేషన్‌లో రిపీట్ కావడంతో విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే.. ఊహించిన స్థాయిలో ఆదరణ అందుకోలేకపోయింది. ధురంధర్ మూవీతో పోటీ పడలేక రేసులో వెనుకపడింది. ఇదిలా ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. పవన్ మూవీ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనేది పరిశీలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. విలన్ పాత్రలో ఆర్. పార్థిబన్ కనిపించగా, కే.ఎస్. రవికుమార్, గౌతమి, రావు రమేష్, ప్రభాస్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్.థమన్ అందించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ మూవీ నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ ఖర్చైనట్లు సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ మానియా, హరీష్ శంకర్ టేకింగ్ పై క్రేజ్‌తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. నైజాం, ఆంధ్రా, సీడెడ్, ఓవర్సీస్ మార్కెట్లలో కలిపి దాదాపు రూ.137 కోట్లకు పైగా బిజినెస్ మార్కెట్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలో రూ.140 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఫిక్స్ చేశారు ట్రేడ్ విశ్లేషకులు. తొలి షో నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ప్రేక్షకులు 'పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైల్ రిటర్న్' అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు కథ, స్క్రీన్‌ప్లే పాత స్టైల్‌లోనే ఉందని విమర్శిస్తున్నారు.
అయితే.. మాస్ ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ స్వాగ్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ట్రేడ్ పోర్టల్ 'సక్నిల్క్' (Sacnilk) గణాంకాల ప్రకారం.. మొదటి సోమవారం రూ.2.50 కోట్లు, మంగళవారం రూ.1.75 కోట్లు, బుధవారం మాత్రం కేవలం రూ.1.14 కోట్లకే పరిమితమైంది. మొత్తంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.65.74 కోట్లు వసూలు చేసింది. కనీసం హరిహర వీరమల్లు ఫస్ట్ వీక్ రికార్డును కూడా దాటలేకపోయింది. రూ.100 కోట్ల మార్క్ చేరడం కూడా కష్టంగా మారింది.
ఇక మరోవైపు ధురంధర్ 2 మాత్రం దూసుకుపోతోంది. ఒక్కరోజే రూ.47.70 కోట్లు వసూలు చేసి, 7 రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకే ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. మొత్తానికి మిక్స్‌డ్ టాక్, గట్టి పోటీ కారణంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ధురంధర్ 2 క్రేజ్ ముందు ఉస్తాద్ భగత్ సింగ్ నిలదొక్కుకోలేకపోతున్నాడు.
ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ
ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ పరంగా భారీ డీల్ కుదిరింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. సినిమా నిర్మాత నవీన్ యెర్నేని ప్రెస్ మీట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు 5 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ మూవీ ఏప్రిల్ 24 ప్రాంతంలో లేదా మే మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి తేదీలలో మార్పులు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న అందుకున్న ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి స్పందన వస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications



















