Ustaad Bhagat Singh OTT: ఆ ఓటీటీ చేతికి ఉస్తాద్ భగత్ సింగ్... పవన్ కళ్యాణ్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓజీ బ్లాక్ బస్టర్ కావడంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. దీనిలో భాగంగా రాజకీయాల్లో ఉంటూనే మరికొన్ని సినిమాలు చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జనసేనాని చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. పవన్ వీరాభిమాని, దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్‌లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ వివరాల్లోకి వెళితే...

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దశరథ్, రమేశ్ రెడ్డిలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయాంక బోస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Ustaad Bhagat Singh OTT Release When And Where To Watch Pawan Kalyan s Movie Online After Theatrical Run

పవన్ కళ్యాణ్ చాలా వరకు తన పార్ట్ వరకు షూటింగ్ పూర్తి చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే కొన్ని ప్యాచ్‌ వర్క్‌లు పెండింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. పవర్ స్టార్ కెరీర్‌లోనే తొలిసారి 300 కోట్ల రూపాయల కలెక్ట్ చేసిన మూవీగా ఓజీ నిలిచింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఉస్తాద్ భగత్ సింగ్ మీద పడింది. దీనికి తోడు గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారరీ హైప్ నెలకొంది.

పవన్ కళ్యాణ్‌ను అభిమానులు కోరుకునే విధంగా చూపించేందుకు హరీశ్ శంకర్ కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, ఆయన వేసిన స్టెప్స్‌కు సంబందించిన వీడియోను రిలీజ్ చేయగా దానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు.. పవర్‌స్టార్ క్రేజ్‌కు తగినట్లుగానే ఈ సినిమా మంచి బిజినెస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. సెట్స్ మీద ఉండగానే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కోసం మైత్రీ అధినేతలకు ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. ఎంతైనా అడ్వాన్స్ ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే నిర్మాతలు తొందరపడే ఉద్దేశంలో కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తాలుకా టీజర్, ట్రైలర్లు రిలీజ్ చేసి రెస్పాన్స్ ఆధారంగా డీల్ కుదుర్చుకునే పనిలో మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలాఉండగా.. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పవన్ కళ్యాణ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. సోషల్ మీడియాలో వార్తలను బట్టి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రైట్స్‌ 80 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్‌లో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X