Ustaad Bhagath Singh OTT: ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్.. పవన్ కళ్యాణ్ మూవీ ఏ ఓటీటీలో?స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై అంచనాను పెంచేశాయి. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఆ హైప్ ఇంకా రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ సంస్థ దక్కించుకుంది? పవన్ మూవీ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనేది పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Ustaad Bhagat Singh OTT Release When And Where To Watch Pawan Kalyan s Movie Online After Theatrical Run

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.

ఉస్తాద్ భగత్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్
పవన్ కళ్యాణ్ మూవీకి ప్రీమియర్స్+ డే 1 అడ్వాన్స్ బుకింగ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ధురంధర్ 2 వంటి భారీ చిత్రం పోటీలో ఉన్నప్పటికీ పవన్ తన హవా చూపించారు. ఉగాది, రంజాన్‌లకు తోడు లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో టికెట్స్‌కు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఉస్తాద్ భగత్ సింగ్‌కు అడ్వాన్స్ సేల్‌లో ఇండియాలో మొత్తం 4566షోలకు గాను 20.20 కోట్ల రూపాయలు వసూలైంది. ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీ బుకింగ్స్ పరిశీలిస్తే.. అమెరికాలో 430 సెంటర్స్‌లో, 1117 షోలకు గాను, 12859 టికెట్లు అమ్ముడై 2,91,344 డాలర్లు ( 2.71 కోట్ల రూపాయలు) రాబట్టింది. మొత్తంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ.. 320K డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 3 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్ + డే 1 అడ్వాన్స్ బుకింగ్ కింద ఉస్తాద్ భగత్ సింగ్ 24 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ ఏ ఓటీటీలో?
ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా కళ్లు చెదిరే ఢీల్‌కు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ హక్కులు కైవసం చేసుకుంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఉస్తాద్ డిజిటల్ రైట్స్ వాల్యూ 80 కోట్ల రూపాయల పైమాటే. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఒప్పందం మీద ఈ డీల్ కుదిరినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కావొచ్చు.. లేదా ముందుగా రావొచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్‌పై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X