Ustaad Bhagat Singh OTT: ఓటీటీలో ఉస్తాద్ మేనియా.. నెట్‌ఫ్లిక్స్‌లో పవన్ కళ్యాణ్ నయా రికార్డ్!
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రంజాన్, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రాగా.. ఇక్కడ పవన్ సినిమాకు ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్, 276 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 72.38 కోట్ల రూపాయల నెట్.. 85.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 11.85 కోట్ల రూపాయలతో కలిపి వరల్డ్ వైడ్‌గా 97.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో 74.41 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.22 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.38 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 4 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఓజీ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు నెలకొనగా.. ఈ సినిమా 100 కోట్ల రూపాయల మార్క్ చేరుకోలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఓటీటీలో ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా
థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత నెల రోజులు తిరక్కుండానే ఏప్రిల్ 16 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్‌లో మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ మూవీకి ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 19 వరకు ఉన్న గణాంకాలను బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ దాదాపు 2.5 మిలియన్ల వ్యూయర్‌షిప్‌ను సాధించింది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో 14 దేశాలలో టాప్ 10లో.. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ 3లో కొనసాగుతోంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ మూవీ కేటగిరీలో గ్లోబల్ వైడ్‌గా టాప్ 3లో కొనసాగుతుండటం పవన్ కళ్యాణ్ స్టామినాకు నిదర్శనం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications


