Vaazha 2 OTT: బ్లాక్ బస్టర్ ‘వాలా 2’ ఓటీటీలోకి .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలైనప్పటికీ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నవి మాత్రం స్ట్రాంగ్ కంటెంట్ సినిమాలే. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి సినిమాలలో సెన్సేషనల్ మూవీ 'వాలా 2' (Vaazha 2) ఒకటి. ఎలాంటి భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా, కథలోని సహజత్వం, పాత్రల ఎమోషన్స్ ఈ సినిమాను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న ఈ యూత్ పుల్ ఎంటర్టైనర్ 'వాలా 2' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ మూవీ ఎక్కడ? ఎందులో స్ట్రీమింగ్ కానున్నదంటే?
మలయాళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 'వాలా 2'పై కూడా మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే '2018', 'ప్రేమలు', 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో, ఇప్పుడు అదే కోవలో 'వాలా 2' కూడా చేరిపోయింది. ముఖ్యంగా యువత జీవితాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లు, కెరీర్‌పై ఉన్న అయోమయాలు, కుటుంబ అంచనాలు, ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ వంటి అంశాలను చాలా సహజంగా తెరకెక్కించారు. అందుకే థియేటర్లలో ఈ సినిమా యూత్‌ను విపరీతంగా కనెక్ట్ చేసుకుని భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో నటించిన యంగ్ స్టార్స్ తమ సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ వంటి నటీనటులు పాత్రల్లో పూర్తిగా లీనమై నటించడం సినిమాకు మరింత రియలిస్టిక్ ఫీల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్య ఉండే సరదా సన్నివేశాలు, కాలేజ్ లైఫ్ మూమెంట్స్, కెరీర్ కోసం పడే కష్టాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలోని కామెడీ కూడా చాలా సహజంగా ఉండటం మరో ప్లస్ పాయింట్‌గా మారింది.
దర్శకుడు ఆనంద్ మీనన్ ఈ చిత్రాన్ని పూర్తిగా నేటి తరం యువత భావోద్వేగాలకు దగ్గరగా తెరకెక్కించారు. కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా ఉండి, జీవితంలోని నిజమైన సంఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల్లో స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేసింది. కొన్ని సన్నివేశాలు నవ్విస్తే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురైనా ముందుకు వెళ్లాలనే సందేశం యువతకు బాగా కనెక్ట్ అవుతోంది.
సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కేరళలోని అందమైన ప్రాంతాలను ఎంతో నేచురల్‌గా చూపించడంతో పాటు, నగర జీవనశైలిని కూడా రియలిస్టిక్‌గా క్యాప్చర్ చేశారు. థియేటర్లలో ఈ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, ఇప్పుడు ఓటీటీలో కూడా అదే ఫీల్ ఇస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్‌కు ఇచ్చిన ట్రీట్మెంట్ సినిమాను మరింత హర్ట్ టచ్చింగ్ గా మార్చేశాయి.
మొత్తంగా థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకుని యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న 'వాలా 2' (Vaazha 2) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 8, 2026 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమాను కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి స్పందన వస్తోంది. డబ్బింగ్ డైలాగ్స్ చాలా నేచురల్‌గా ఉండటంతో ఒరిజినల్ ఫీల్ ఏమాత్రం తగ్గలేదని ఇప్పటికే చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్న వారికి ఈ మూవీ వీకెండ్ స్పెషల్ ఎంటర్టైనర్‌గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, వీకెండ్‌లో ఎక్కువ మంది చూసే సినిమాల్లో ఇది టాప్‌లో నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications