Telugu Indian Idol: వాగ్దేవి పాటకు మెగాస్టార్ ఫిదా.. స్టేజ్ పైనే బంపరాఫర్!
ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో చివరి దశకు చేరుకుంది. 15 వారాల పాటు ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన ఈ రియాలిటీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇక తెలుగు ఇండియన్ ఐడల్ గా ఎవరు గెలుస్తారు అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే మెగా ఫైనాన్స్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ప్రముఖ సింగర్ వాగ్దేవికి ఆయన ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం విశేషం. అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎవరు ఊహించలేదు.
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ప్రధాన న్యాయమూర్తిగా అలాగే ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ న్యాయనిర్ణేతగా మొదలైన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో అద్భుతంగా కొనసాగుతోంది. మొదటి ఎపిసోడ్ నుంచి కూడా ఈ సింగింగ్ షో కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. మొదటిసారి తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మొదలైన ఈ సింగింగ్ షోకు ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుంది అని ఎవరూ ఊహించలేదు

మెగాస్టార్ అతిధిగా..
ఇక 15 వారాల పాటు కొనసాగిన ఈ సింగింగ్ రియాల్టీ షోలో ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే ఫైనల్ ఎపిసోడ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేక అతిథిగా వచ్చి ఫైనల్ విన్నర్ కి టైటిల్ ను కూడా అందించారు. అయితే షోకు సంబంధించిన కొన్ని ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అదృష్టంగా భావిస్తున్నాను..
ఇక తెలుగు ఇండియన్ ఐడల్ లో ఎక్కువ క్రేజ్ అందుకున్న వారిలో వాగ్దేవి ఒకరు. చూడగానే పూజా హెగ్డే అంటూ బాలయ్య బాబు ప్రత్యేకంగా ఒక పేరు పెట్టడం కూడా ఆమెకు బాగా క్రేజ్ తీసుకొచ్చింది. అయితే వాగ్దేవి లవ్లీ మూమెంట్స్ వీడియో లో ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తెలుగు ఇండియన్ ఐడల్ లో మొదటి నుంచి కూడా మధురమైన క్షణాలను చూశాను అంటూ ఇందులోపాల్గొనడమే తన అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపింది.

బాలయ్యతో బెస్ట్ మూమెంట్
ఇక ఈ షో లో పాల్గొన్నప్పుడు ఒక పాట పాడుతున్నప్పుడు మా అమ్మ రావడం ఆమెతో స్టేజ్ పంచుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా ఇలాంటి ప్లాట్ ఫామ్ మాలాంటి సింగర్స్ కు చాలా గొప్ప అవకాశం. ఇక బాలయ్య బాబుతో కూడా వాగ్దేవికి ఒక ప్రత్యేకమైన మూమెంట్ ఉండడం విశేషం. ఆయన ఆమెను ప్రత్యేకంగా పూజ హెగ్డే తో పోల్చిన ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. ఇక తెలుగు ఇండియన్ ఐడల్ నా కెరీర్లో సెపరేట్ గా ఒక గోల్డ్ తో రాసిన మూమెంట్ అని కూడా వాగ్దేవి వివరణ ఇచ్చింది.

మెగాస్టార్ ఫిదా
ఇక వాగ్దేవి 'ఆట కావాలా పాట కావాలా' అనే పాట కు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. ఇక త్వరలోనే నీ పాటకు నేను హీరోయిన్ తో డాన్స్ చేసే అవకాశం తొందర్లోనే వస్తుంది అని కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు. అంటే భవిష్యత్తులో వాగ్దేవికి మెగాస్టార్ సినిమా లో సింగర్ గా అవకాశం వస్తుంది అని హింట్ ఇచ్చేశారు. అంతేకాకుండా వాగ్దేవి మొదట లాహే లాహే అనే పాట పాడే ఈ షోకి సెలెక్ట్ అయినట్లుగా మెగాస్టార్ గురించి తెలియజేశారు.
వాగ్దేవి.. వావ్ దేవి!
అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి వాగ్దేవి గురించి ప్రత్యేకంగా ఒక కవిత్వం కూడా చదివారు. డియర్ వాగ్దేవి నువ్వు నా మనసులో జూనియర్ పూజా హెగ్డేవి అంటూ.. ఇది నేను రాయలేదు అని మెగాస్టార్ సరదాగా చెప్పారు. ఇక ఇండియన్ ఐడల్ కి ముందు వాగ్దేవిని అంటూ ఇండియన్ ఐడల్ తర్వాత వావ్ దేవి అని బాలయ్య డైలాగ్ ను గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











