ఒకేరోజు 3 OTTల్లోకి రాబోతున్న సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. సీన్ సీన్‌కు ఉత్కంఠ రేపే దీన్ని ఎలా చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్రర్, థ్రిల్లర్, క్రైమ్, కామెడీ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. సినీ ప్రియులు కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే వాళ్లు కూడా వీటినే ఎక్కువగా చూస్తున్నారు. ముఖ్యంగా అదిరిపోయే కాన్సెప్ట్ తో ఉన్న చిత్రాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలు పోటీ పడుతుంటాయి. కొన్నింటిని ఒకే ఒక సంస్థ దక్కించుకోగా.. మరికొన్ని చిత్రాల హక్కులను మాత్రం అనేక ఓటీట సంస్థలు దక్కకించుకుంటాయి. ఈ మధ్య ఎక్కువగా ఇదే ట్రెండ్ సాగుతోంది.
ముఖ్యంగా ఒక్కో సినిమా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో, 3 ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విడుదల అవుతుంది. అయితే తాజాగా ఓ అదిరిపోయే సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. అది కూడా ఒక్క దాంట్లోకి కాదు ఏకంగా మూడు ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడెక్కక్కడ, ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైభవ్, నందితా శ్వేతాలు హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మిస్టరీ థ్రిల్లర్ చిత్రమే రణం. తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో వచ్చిందీ చిత్రం. షరీఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైభవ్, నందిత శ్వేతలతో పాటు సురేష్ చక్రవర్తి, తాన్య హోప్, సరస్వతీ మీనన్, జీవా సుబ్రహ్మణ్యన్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే తమిళంలో ఫిబ్రవరి 23వ తేదీన విడుదల అయిన ఈసినిమా బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టుకుంది.
సీరియల్ కిల్లర్ చేసే హత్యలను చేధించే కథాంశంతో వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ముఖ్యంగా 3 ఓటీటీల్లో ఈ సినిమా సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది. అయితే ఈ మూడు ఓటీటీల్లోనూ ఒకేరోజు విడుదల కావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగానే కాకుండా టెంట్ కొట్టా, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఏప్రిల్ 19వ తేదీ నుంచి కానుంది.
ఈ అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీ 7.8 రేటింగ్ ఇచ్చింది. దాదాపు థియేటరల్లలో విడుదల అయిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాను చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారు మీకు నచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రేపటి నుంచి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లు మాత్రం ఈ చిత్రాన్ని అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











