Ranga Ranga Vaibhavanga: ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన వైష్ణవ తేజ్ మూవీ.. ఎప్పుడంటే?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ సక్సెస్ తో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ తేజ్ ఆ తర్వాత కూడా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకున్నాడు. అయితే మొదటి సినిమా 100 కోట్లకు పైగా బిజినెస్ చేయగా ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం కనీసం 10 కోట్ల మార్కెట్ ను కూడా అందుకోలేకపోయాయి. రెండవ సినిమా క్రిష్ దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే. కొండపొలం అనే ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రాఫిట్స్ అందించలేదు.

ఇక ఆ తర్వాత వచ్చిన రంగ రంగ వైభవంగా అనే సినిమాతో అయినా వైష్ణవ్ మంచి సక్సెస్ అందుకుంటాడు అనే అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా విడుదలకు ముందు కొంత పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్ సాంగ్స్ కూడా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో రీమేక్ చేసిన గిరీషయ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

Vaishnav tej Ranga Ranga Vaibhavanga movie ott release date update

ఇక రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటించిన కేతిక శర్మ కూడా రొమాంటిక్ సన్నివేశాలతో బాగా మెప్పించింది. అయితే ప్రధాన జోడి మద్యం కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయినప్పటికీ కూడా సినిమా అయితే పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద సినిమా పెద్దగా ప్రాఫిట్స్ కూడా అందించలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి.

రంగ రంగ వైభవంగా సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఆరోజు కుదరకపోతే అక్టోబర్ 7వ తేదీన ఓటీటీలో విడుదల కావచ్చు అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. త్వరలోనే ఓటీటీ విడుదల తేదీ పై కూడా చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఒక ప్రకటన కూడా రానుంది. మరి థియేటర్లో సక్సెస్ కాలేకపోయినా ఈ సినిమా ఓటీటీ లో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X