Adikeshava OTT: మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. అప్పుడే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆదికేశవ
మెగా ఫ్యామిలీ నుంచి 'ఉప్పెన' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఫస్ట్ మూవీతోనే వంద కోట్ల హీరోగా పేరు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. అయితే, ఆ తర్వాత అతడు చేసిన రెండు సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో వైష్ణవ్ 'ఆదికేశవ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి రూపొందించిన సినిమానే 'ఆదికేశవ'. డివోషనల్ టచ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. రెండో రోజు కూడా ఇది అంతగా రెస్పాన్స్ దక్కించుకోలేదు.

ఎన్నో అంచనాల నడుమ ఆడియెన్స్ ముందుకు వచ్చిన 'ఆదికేశవ' మూవీకి థియేటర్లలో ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్లను కూడా పెద్దగా రాబట్టడం లేదు. దీంతో ఇది భారీ నష్టాలను మూటగట్టుకునే దిశగా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆదికేశవ' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చేశాయి.
'ఆదికేశవ' సినిమాపై అంచనాలు ఏర్పడడడంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, దీన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే స్ట్రీమింగ్‌కు తెస్తారని కూడా న్యూస్ వచ్చింది.

మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' సినిమాకు ఆశించిన ఫలితం రాకపోవడంతో దీన్ని ముందుగానే ఓటీటీలోకి తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన స్ట్రీమింగ్‌కు తెస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. 'ఆదికేశవ' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, సుధ తదితరులు కీలక పాత్రలను చేశారు.


Click it and Unblock the Notifications











