నెల కాకుండానే ఓటీటీలోకి వచ్చిన మెగా మూవీ.. ఇందులో కూడా ఫ్యాన్స్‌కు షాకే
మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయిన విషయం తెలిసిందే. కానీ, అందులో ఆరంభంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటింది మాత్రం చాలా తక్కువ మందే అని చెప్పాలి. అందులో 'ఉప్పెన' చిత్రంతో గ్రాండ్ ఎంట్రీని ఖాతాలో వేసుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయాడు.
మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకోవాలన్న కసితో 'ఆదికేశవ' అనే సినిమాను చేశాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

డివోషనల్ టచ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆదికేశవ' మూవీకి ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. రెండో రోజు కూడా ఇది అంతగా రెస్పాన్స్ దక్కించుకోలేదు. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే రన్‌ను ముగించుకోవాల్సి వచ్చింది. దీంతో ఎన్నో నష్టాలను ఇది చవి చూసింది.
వైష్ణవ్ తేజ్ - శ్రీలీల జంటగా నటించిన 'ఆదికేశవ' సినిమాపై అంచనాలు ఏర్పడడడంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించింది. ఇక, దీన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే స్ట్రీమింగ్‌కు తెస్తారని కూడా న్యూస్ వచ్చింది.

వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' సినిమాకు ఆశించిన ఫలితం రాకపోవడంతో దీన్ని ముందుగానే ఓటీటీలోకి తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీ నుంచే నెట్‌ఫ్లిక్స్ సంస్థ అందుబాటులోకి తెచ్చేసింది. ఇక, ఇందులో కూడా సెన్సార్ చేసిన వెర్షన్‌నే తీసుకు వచ్చి ఫ్యాన్స్‌కు ఇంకాస్త నిరాశనే మిగిల్చింది.
ఇదిలా ఉండగా.. 'ఆదికేశవ' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, సుధ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











