Adikeshava OTT: ఆదికేశవ ఓటీటీ వివరాలు లీక్.. ఎందులో, ఎప్పుడు రాబోతుందంటే!
సాధారణంగా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి చాలా మందే హీరోలుగా వచ్చారు. కానీ, ఫస్ట్ మూవీతోనే వంద కోట్లు కొట్టిన వాళ్లు మాత్రం చాలా అరుదు. ఈ పరిస్థితుల్లో 'ఉప్పెన' మూవీతో హీరోగా పరిచయమై.. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. పేరుకు మెగా హీరోనే అయినా ఎంతో కష్టపడుతూ సొంత ఇమేజ్‌ను దక్కించుకోవాలని చూస్తున్నాడు.
'ఉప్పెన' వంటి బిగ్ సక్సెస్ తర్వాత వైష్ణవ్ తేజ్ పలు చిత్రాల్లో నటించాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో 'ఆదికేశవ' అనే సినిమాను చేశాడు. కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని తెరకెక్కించారు.

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే దర్శకుడితో కలిసి 'ఆదికేశవ' అనే సినిమాను చేస్తున్నాడు. డివోషనల్ టచ్‌తో రూపొందిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. మరి ఇదే కంటిన్యూ అవుతుందో లేదో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ వివరాలు లీకయ్యాయి.
'ఆదికేశవ' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే నవంబర్ 24వ తేదీన విడుదలైన 'ఆదికేశవ' చిత్రం డిసెంబర్ చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.
'ఆదికేశవ' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేశారు.


Click it and Unblock the Notifications











