OTT: వాలెంటైన్స్ డే స్పెషల్... ఓటీటీలో ది బెస్ట్ టాప్ 10 అందమైన తెలుగు ప్రేమ కథా చిత్రాలివే!

వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. అలాంటి రోజున ప్రేమించిన వాళ్లతో ఓ మంచి ప్రేమకథా చిత్రం చూస్తే.. ఆ ఆనందం వేరు. బయటకెళ్లి చూసే వారికోసం నిర్మాతలు ప్రేమకథా చిత్రాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. మరి బయటకు వచ్చి చూసే ఓపిక లేని వారి కోసం మీకు ది బెస్ట్ టాప్ 10 ఓటీటీ చిత్రాలను తీసుకువచ్చాము. ఆ చిత్రాలు ఏంటి.. ఎందులో చూడాలి అనే వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.

ఫిబ్రవరి 14 అంటేనే లవర్స్‌కు మోస్ట్ స్పెషల్ డే అని తెలిసిందే. అందుకే ఆ రోజును టార్గెట్ చేసుకుని ప్రేమకథా చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. ఇక ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా దర్శక నిర్మాతలు థియేటర్లలో బోలెడన్నీ ప్రేమకథ చిత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఇక బయటకు వెళ్లి చూసే ఓపిక లేని వారికోసం ఓటీటీలో మంచి ప్రేమకథ చిత్రాలను తీసుకువచ్చాడు.

Valentines Day Special: These are Top 10 Beautiful Love Story Movies in OTT Full Details Here

ఓటీటీలో అందమైన ప్రేమ కథ చిత్రాలివే...

1. ప్రేమికుల రోజు - కాతిర్ దర్శకత్వంలో కునాల్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఉర్రూతలూగిస్తాయి. ఇక ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్, జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలో అందుబాటులో ఉంది.

2. సఖి - మణిరత్నం తెరకెక్కించిన ఈ ప్రేమ కావ్యం అయితే సంచలనమే. మాధవన్, శాలిని హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇక ఈ చిత్రంలోని పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ చిత్రం యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

3. చెలి - గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్, రీమాసేన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కింది. ఇక ఈ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Valentines Day Special: These are Top 10 Beautiful Love Story Movies in OTT Full Details Here

4. నువ్వు నేను ప్రేమ - సూర్య, జ్యోతిక, భూమిక నటించిన ఈ సినిమా సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్ కృష్ణ దర్శకత్వం వహించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిచారు. ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

5. ప్రియురాలు పిలిచింది - అతిత్, మమ్ముట్టి, ఐశ్వర్యరాయ్, టబు నటించిన ఈ చిత్రం కూడా అప్పట్లో ఓ సెన్సేషన్, ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

6. రోజా - అరవింద్ స్వామి, మధుభాల నటించిన ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Valentines Day Special: These are Top 10 Beautiful Love Story Movies in OTT Full Details Here

7. తొలిప్రేమ - పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిస్ని ప్లస్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

8. ఏ మాయ చేశావే.. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన అందమైన కావ్యల్లో ఇది ఒకటి. నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

9. ఏటో వెళ్లిపోయింది మనసు.- ఈ చిత్రం కూడా గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

10. సీతారామం.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ ప్రేమ కావ్యం తాజాగా థియేటర్లలో కూడా రీరిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X