Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ అని తేల్చేసిన స్టార్ నటి.. ఎలా అంటే?
బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారో అనేది ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్స్ లో టాప్ 5 లిస్ట్ పై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. టాప్ 3 కంటెస్టెంట్స్ పేర్లు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇక మొదటి రెండు స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక అందులో ఫైనల్ విన్నర్ పై కూడా ఒక హీరోయిన్ క్లారిటీ ఇవ్వడం విశేషం. తన సపోర్టు అందిస్తూ తప్పకుండా ఆ కంటెస్టెంట్ గెలవాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎలాగైనా టాప్ 5 లో నిలవాలని..
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈ రోజు రోజుకు మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. ఎలాగైనా టాప్ ఫైవ్ లో నిలవాలని అనుకున్నానని నటరాజ్ మాస్టర్ అనవసరంగా బిందు మాధవి తో గొడవ పెట్టుకుని ఇరకాటంలో పడ్డాడు. అంతేకాకుండా అఖిల్ సార్ధక్ దగ్గర కూడా అతను గొడవపడిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఇద్దరితో గొడవలు పడటం వలన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

ఏ మాత్రం ఎమోషన్స్ లేకుండా
దాదాపు ఆఖరి దశకు చేరుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఎలాగైనా టైటిల్ విన్నర్ గా నిలవాలని ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. గతంలో చాలా స్నేహంగా ఉన్న వారు కూడా ఇప్పుడు ఏ మాత్రం ఎమోషన్స్ లేకుండా మొండిగా ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా సరే విజయం సాధించాలని యాంకర్ శివ కూడా గట్టిగానే పోరాడుతున్నాడు

ప్రతి వారంలో..
మొదటి నుంచి కూడా ఈ సారి ఫైనల్ విన్నర్స్ ఎవరు అనే విషయంలో అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. అందులో ఎక్కువగా బిందుమాధవి పేరు అయితే గట్టిగానే వినిపించింది. ఎందుకంటే ప్రతి వారంలో కూడా అతను భారీ స్థాయిలో ఓట్లు అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా అతను ఎంత గ్రూప్ గేమ్ ఆడినప్పటికీ కూడా ప్రతి టాస్క్ లో కూడా తన బలాన్ని అయితే చూపించాడు.

ఆమెనే విన్నర్
ఇక అఖిల్ సార్ధక్ అందరికంటే ఎక్కువగా బిందుమాధవికి మాత్రమే గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పాలి. ఆమె కూడా ఒక్క వారంలో తన ఓట్ల సంఖ్యను పెంచుకుంటూ అతనికి గట్టి పోటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం అయితే బిందుమాధవి తప్పకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తుంది అని చాలా మంది చెబుతున్నారు. ఇటీవల మరొక హీరోయిన్ కూడా అదే విషయాన్ని చెప్పడం విశేషం.

వరలక్ష్మి శరత్ కుమార్..
క్రాక్ సినిమాతో జయమ్మగా క్రేజ్ అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కూడా బిందుమాధవికి సపోర్ట్ చేసింది. మా ఆడపులికి ఆఖరి వారంలో ఆల్ అది బెస్ట్ అంటూ.. మీరు విజేతగా నిలుస్తారు అని నేను కచ్చితంగా చెప్పగలను. ఇప్పటికే మీరు గెలిచేశారు.. అనే తరహాలో వరలక్ష్మి వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











