జబర్ధస్త్ టీమ్ లీడర్‌కు ఐదుగురితో ఎఫైర్స్: లీక్ చేసి వర్ష.. ఆమెతో కూడా లింక్ ఉందంటూ!
గతంలో కంటే ఇప్పుడు తెలుగులో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. అందులోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువైన తర్వాత వీటి సంఖ్య మరింత ఎక్కువగా పెరిగిపోయింది. ఇలా ఇప్పుడు ఎన్నో డిఫరెంట్ కాన్సెప్టు షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి వాటిలో ఆహాలో ప్రసారం అవుతోన్న 'ఫ్యామిలీ ధమాకా' ఒకటి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ కార్యక్రమం మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొన్న జబర్ధస్త్ వర్ష సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!
విశ్వక్ ఫ్యామిలీ ధమాకా షో
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విశ్వక్ సేన్ హోస్టుగా ప్రారంభం అయిన షోనే 'ఫ్యామిలీ ధమాకా'. ఫేమస్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్‌లో భాగంగా ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్‌లు పూర్తి అయ్యాయి. వీటికి బుల్లితెర, సినీ రంగానికి చెందిన ఎంతో మంది సెలెబ్రిటీలు హాజరై రకరకాల గేమ్స్ ఆడారు. తద్వారా వినోదాన్ని అందించారు.

సూపర్ సక్సెస్ అయిన షో
విశ్వక్ సేన్ హోస్టింగ్‌లో ప్రతి శుక్రవారం ప్రసారం అవుతోన్న 'ఫ్యామిలీ ధమాకా' షోకు ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీన్ని ఎక్కువగా యూత్ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఫలితంగా ఈ షోకు మంచి వ్యూస్ లభిస్తున్నాయి. తద్వారా ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ చేసే 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' తర్వాత అంతటి స్పందనను అందుకున్న షోగా ఇది సత్తా చాటుతోంది.
జబర్ధస్త్ కమెడియన్స్‌తో
'ఫ్యామిలీ ధమాకా' షోలో ఇటీవల జరిగిన 5వ ఎపిసోడ్‌లో భాగంగా కమెడియన్లను తీసుకు వచ్చారు. ఇందులో అదిరే అభి, జబర్ధస్త్ మహేశ్, వర్ష, కమెడియన్ భద్రం ఒక టీమ్‌గా ఉన్నారు. మరో జట్టులో సత్య, రాకింగ్ రాకేష్, బుల్లెట్ భాస్కర్, కమెడియన్ సుదర్శన్‌లు ఉన్నారు. వీళ్లంతా కలిసి ఈ షోలో యమ సందడి చేశారు. అలాగే, విశ్వక్ కూడా వీళ్లతో చాలా బాగా ఆడుకున్నాడు.
తొంగి చూసి మరీ వేసింది
'ఫ్యామిలీ ధమాకా' షోలో రెండు టీమ్‌లను పరిచయం చేసిన తర్వాత వర్షను విశ్వక్ ఎట్లున్నావ్ అని అడిగాడు. అప్పుడు అభి 'మీరిద్దరూ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నారు' అని అన్నాడు. అప్పుడు వర్ష 'ఆయనంటే ఇష్టం కాబట్టే తెలియకుండా మ్యాచింగ్ వేసుకున్నాం' అంది. దీంతో అభి 'కాదు.. క్యారవాన్‌లో తొంగి చూసి మరీ వేసుకుంది' అంటూ పంచ్ వేశాడు.

ఎట్లుంది ఫ్యామిలీ లైఫ్?
ఆ తర్వాత విశ్వక్ సేన్ 'ఎట్లుంది ఫ్యామిలీ లైఫ్' అని రాకింగ్ రాకేష్‌ను ప్రశ్నించాడు. దీనికతడు 'ఎట్లున్నా బయటకు చెప్పుకోము కదన్నా' అని బదులిచ్చాడు. అంతలోనే బుల్లెట్ భాస్కర్ కలుగజేసుకుని 'పెళ్లైన తర్వాత ఇంకేమీ ఉండదు' అన్నాడు. దీనికి రాకేష్ 'నీకు ఉండదు.. అన్నా ఒక ఇంటికైతే ఉంటది. మూడు ఇళ్లకు అయితే ఉండదు' అని షాకిచ్చాడు.
ఆ ఐదో ఇల్లు నీదే అని
బుల్లెట్ భాస్కర్‌కు మూడు ఎఫైర్లు ఉన్నాయని రాకేష్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అప్పుడు వర్ష కలుగజేసుకుని 'బుల్లెట్ భాస్కర్‌కు ఉన్న ఇళ్లు (ఎఫైర్లు) మూడు కాదు.. ఐదు' అని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనికి బుల్లెట్ భాస్కర్ 'ఆ ఐదు ఇల్లు ఆమెదే' అంటూ వర్షకు ఝలక్ ఇచ్చాడు. మొత్తానికి భాస్కర్, వర్ష చేసిన కామెంట్ల వల్ల ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











