డైరెక్ట్‌గా OTTలోకి రాబోతున్న వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
ఈ మధ్య అనేక సినిమాలు నేరుగా ఓటీటీల్లోకి వస్తూ సందడి చేస్తున్నారు. కరోనా సమయంలో మొదలైన ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా.. అనేక క్రేజీ చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా మరో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా చేశారు. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ్ సందేశ్ హీరోగా చేసిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీయే "చిత్రం చూడరా". ఆర్.ఎన్ హర్ష వర్ధన్ దర్శకత్వంలో.. అన్నపూర్ణమ్మ, రవిబాబు, తనికెళ్ల భరణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. వీరితో పాటు శీతల్ భట్, విక్కీ దేవ్, ధన్ రాజ్, మీనా కుమారి, శివాజీ రాజా, రైజింగ్ రాజు, కేఏ పాల్ రాము, రచ్చ రవి, రాజా రవీంద్ర, సతీష్ సరిపల్లి, పింగ్ పాంగ్ సూర్య, కాశీ విశ్వనాథన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

అయితే ఈ క్రేజీ చిత్రాన్ని బీఎం సినిమాస్ బ్యానర్ పై శేషు మారంరెడ్డి, భాగ్యలక్ష్మీ బోయపాటిలు నిర్మించారు. ఈ చిత్రానికి రథన్ సంగీతం అందించగా... రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సామాన్య యువకుడి పాత్రలో వరుణ్ సందేశ్ సందడి చేయబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ క్రేజీ మూవీని ముందుగా థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల కుదరలేదు. అలా ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన ఈవీటీ విన్ వేదికగా చిత్రం చూడరా మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రాబోతున్న ఈటీవీ విన్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ తో పాటు, పోస్టర్లు కూడా ఆసక్తికరంగా ఉండడంతో అంతా ఈ సినిమాలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ సినిమా వస్తుండగా.. ఎలా కనిపించబోతున్నాడా అని అంతా ఎగ్జైట్ అవుతున్నారు. చూడాలి మరి ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీలో ఏ రేంజ్ లో సందడి చేయనుంది అనేది.


Click it and Unblock the Notifications











