3 వారాలకే ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అలా చూస్తే వణికిపోవడమే!
గతంలో కంటే ఇప్పుడు హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆ తరహా సినిమాలు అధిక సంఖ్యలో తెరకెక్కుతోన్నాయి. ఇలా వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల స్పందన కూడా లభిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'విరాజి' (Viraaji).
ఒకప్పుడు తనదైన లవ్ స్టోరీ మూవీలతో ప్రేక్షకులను అలరించిన వరుణ్ సందేశ్.. ఇప్పుడు డిఫరెంట్ చిత్రాలతో వస్తున్నాడు. అలా ఇటీవలే అతడు నటించిన సినిమానే 'విరాజి'. ఆదిత్య హర్ష తెరకెక్కించిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చింది. దీనికితోడు ప్రమోషన్ కూడా వెరైటీగా చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని తీసుకు వచ్చారు.

భయపెట్టే మర్డర్ మిస్టరీ స్టోరీతో వరుణ్ సందేశ్ నటించిన 'విరాజి' సినిమా అగస్టు 2వ తేదీన థియేటర్లలోకి వచ్చేసింది. దీనికి ఆశించిన స్థాయిలో మౌత్ టాక్ రాకపోవడంతో ప్రేక్షకుల నుంచి కూడా స్పందన అనుకున్న విధంగా రాలేదు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో ఈ చిత్రం ఓటీటీ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
మర్డర్ మిస్టరీ కాన్సెప్టుతో తెరకెక్కిన 'విరాజి' సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా పరాజయం పాలవడంతో వీలైనంత త్వరగానే ఇది ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఆగస్టు 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆహా సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఈ చిత్రం కోసం చాలా మంది వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'విరాజి' సినిమాను ఆదిత్య హర్ష తెరకెక్కించాడు. దీన్ని ఎమ్3 బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మించారు. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి Ebenezer Paul సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











