OTTలోకి వరుణ్, లావణ్య పెళ్లి వీడియో... నాగబాబు ఎంతకు అమ్మారో తెలిస్తే షాకే?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నవంబర్ 1వ తేదీన ఇటలీలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీతో పాటు.. అల్లు ఫ్యామిలీ, ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రేటీలు హాజరు అయ్యారు. ఇక పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రెసెప్షన్ కూడా ఇచ్చారు. అయితే వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వీడియోను నాగబాబు నెట్ ఫ్లిక్స్ కు భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి, ఫిదా కుర్రాడు వరుణ్ తేజ్ ఐదు ఆరేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకుని ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించి... ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీలో ఇరుకుటుంబాల మధ్య వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

ఇక ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు... అల్లు, త్రిపాఠి ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరు అయ్యారు. అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి హాజరయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్ కన్వేషన్షన్ హాల్ లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి సెలబ్రేటీలు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇక వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వార్తలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వరుణ్ లావ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇటలీలో జరిగిన వరుణ్ లావ్ పెళ్లికి సంబంధించిన వీడియోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు విక్రయించిందట. ఇక వీరి పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వీడియోను ఏకంగారూ.8 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా అయితే రాలేదు కానీ... ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.
రూ.8 కోట్లు అంటే.. పెళ్లికి పెట్టిన ఖర్చు మొత్తం తిరిగి వచ్చేసినట్లే అంటున్నారు. ఇక అప్పట్లో నయన్ విఘ్నేష్ శివన్ పెళ్లి వీడియోను కూడా నెట్ ఫ్లిక్స్ ఇలాగే రూ.20 కోట్లకు డీల్ కుదుర్చుకోగా.. నిబంధనలను పాటించని కారణంగా ఆ కాంట్రాక్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











