OTTలోకి సైలెంటుగా వచ్చేసిన సూపర్ హిట్ తెలుగు మూవీ... డోంట్ మిస్!

వీకెండ్​ రావడంతో ఓటీటీలోకి పలు హిట్ సినిమా, సిరీస్​లు, ఒరిజనల్స్ వచ్చేశాయి. అందులో ఇంట్రెస్టింగ్​వి కూడా చాలానే ఉన్నాయి. వీటితో పాటు మెగా హీరో ప్రిన్స్​ వరుణ్ తేజ్​ నటించిన ఆపరేషన్​ వాలంటైన్​ కూడా వచ్చేసింది. కానీ ఓటీటీ ఆడియెన్స్​ను ఓ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

మెగా ఫ్యామిలీ బ్రాండ్​తో నాగబాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో వరుణ్ తేజ్. మొదటి నుంచి స్టోరీల సెలక్షన్​లో వైవిధ్యత చూపించి మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. కానీ ఆయన ఎంచుకునే కథలు బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను సాధించలేకపోతున్నాయి. అయినా కూడా ఆయన ప్రయత్నాలను ఆపకుండా ముందుకు వెళ్తున్నారు.

Varun Tej Operation Valentine Movie Streaming Now on Amazon Prime Video OTT Full Details Here

అలా రీసెంట్​గా ఆపరేషన్​ వాలంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అసలే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏరియల్ యాక్ష‌న్ జాన‌ర్ సినిమాలపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పటికే హృతిక్ రోష‌న్ ఫైట‌ర్​తో రాగా అదే జానర్​లో ఆపరేషన్​ వాలంటైన్​తో వచ్చారు వరుణ్య తెలుగులో తెరకెక్కిన మొదటి ఏరియ‌ల్ యాక్ష‌న్ చిత్ర‌మిదే. ఇందులో హీరోయిన్​గా మానుషి చిల్లర్ నటించింది.

నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్ర పోషించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. నవీన్‌ నూలి ఎడిటర్​గా వ్యవహరించారు. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు ఇచ్చారు. సోనీ పిక్చర్స్‌ బ్యానర్​పై సందీప్‌ ముద్ద నిర్మాతగా వ్యవహరించారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించారు.

Varun Tej Operation Valentine Movie Streaming Now on Amazon Prime Video OTT Full Details Here

చిత్రంలో ఫైట‌ర్ జెట్ పైల‌ట్​గా వరుణ్ తేజ్​ చేసిన ధైర్యసాహ‌సాలు బాగానే ఆకట్టుకున్నాయి. దేశ‌భ‌క్తి నేప‌థ్య‌మే ప్ర‌ధానంగా సాగింది. అయితే సినిమాకు దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే స‌న్నివేశాలు, వ‌రుణ్‌తేజ్, మానుషి చిల్ల‌ర్‌ నటన, విజువ‌ల్స్ బలంగా నిలిచాయి. శ‌త్రువుల స్థావ‌రాల్ని ధ్వంసం చేసే స‌న్నివేశాలు అయితే రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేస్తాయి. కథనం, కొరవడిన భావోద్వేగాలు బలహీనంగా నిలిచాయి. హీరోహీరోయిన్​ మ‌ధ్య సాగే సన్నివేశాల్లో గాఢ‌త లేదు. ఇక హృతిక్​ ఫైట‌ర్ క‌థ‌కు కూడా చాలా ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం కూడా మైనస్సే. దీంతో ఈ చిత్రం కూడా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అయితే ఇప్పుడు 22 రోజుల వ్యవధిలోనే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం ఓటీటీలోకి సైలెంట్​గా వ‌చ్చేసింది. కానీ ఆడియెన్స్‌కు ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్​. రెంట‌ల్ విధానంలో మూవీని విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. దీనిని చూడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు అద‌నంగా 279 రూపాయ‌లు చెల్లించాలి. చూడాలి మరి థియేటర్లలో ఆడని ఈ సినిమా ఓటీటీలో ఎంత వరకు ఆడియెన్స్​ను ఆకట్టుకుంటుందో.. ఇకపోతే వరుణ్ తేజ్ ప్రస్తుత మట్కా అనే సినిమా చేస్తున్నారు. పిరీయాడికల్ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాకు క‌రుణ కుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X